లక్షణాలుంటే పరీక్ష చేయించుకోవాలి


  •   జిల్లా వైద్యాధికారి సుమన్‌మోహన్‌రావు


సిరిసిల్ల ఎల్లారెడ్డిపేట,(ఆరోగ్యజ్యోతి):  కొవిడ్‌ పట్ల అలసత్వం వహించవద్దని, లక్షణాలుంటే పరీక్ష చేయించుకొని జాగ్రత్తలు పాటించాలని జిల్లా వైద్యాధికారి సుమన్‌మోహన్‌రావు హెచ్చరించారు. గురువారం ఆయన పదిరలో మొబైల్‌ వాహనంలో నిర్వహించిన కొవి డ్‌ నిర్ధారణ పరీక్షా కేంద్రాన్ని పరిశీలించి మాట్లాడారు. భౌతిక దూరం పాటించి, మాస్కులు ధరించాలని సూచించారు. వైద్యాధికారి ధర్మానాయక్‌ మాట్లాడుతూ, కరోనా పాజిటివ్‌ వస్తే తగిన జాగ్రత్తలు పాటించాలని చెప్పారు. ఎల్లారెడ్డిపేట మండలంలో 168 మందికి కరోనా టెస్టులు చేయగా ఇద్దరికి మాత్రమే పాజిటివ్‌ వచ్చిందని తెలిపారు.