- తెలంగాణ మెడికల్ & హెల్త్ అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ బొంకంటి సుభాష్
ఆదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి): కోవిడ్ - 19 కూ
ప్రపంచ దేశాలు వనికి పోతున్న తరుణంలో కూడా ఆసుపత్రిలో రోగులకు సేవచేస్తున్నటు వంటి
పరిశుద్ద కార్మికులకు 10% ఇన్సెంటివ్ (కెసిఆర్ కానుక )మార్చి నెలలో ప్రభుత్వం
ప్రకటించడం జరిగిందని తెలంగాణ మెడికల్ & హెల్త్ అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్
ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ బొంకంటి సుభాష్ అన్నారు. కానీ ఇప్పటి వరకు ఏ ఒక్కరికీ ఇవ్వలేదని
అలాగే మే 2020 నుండి నర్సింగ్ స్టాఫ్
& పారామెడికల్
సిబ్బంది కి కుడా ఇవ్వలేదన్నారు. కావున
ప్రభుత్వం వెంటనే స్పందించి 10% ఇన్సెంటివ్ ఇవ్వాలి అని ప్రభుత్వాన్ని కోరినారు. GHMC హైదరాబాద్ ఎన్నికల
ముందు పరిశుద్ద కార్మికులకు వేతనాలు
పెంచారని, అలాగే హాస్పిటల్ సిబ్బందికి జీతాలు ఎందుకు పెంచటం
లేదని అయన ఆవేదన వ్యక్తం చేసినారు. ఆత్మాభిమానం చప్పుకొని తక్కువ వేతనం తో విధులు
నిర్వర్తిస్తున్న అవుట్ సోర్సింగ్ & కాంట్రాక్ట్ ,పరిశుద్ద కార్మికులు,సెక్యూరిటీ
గార్డు లు, ectr కూడా ప్రభుత్వం వెంటనే స్పందించి అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల కూ
న్యాయం చేయాలని అయన ప్రభుత్వాన్ని
కోరినారు.