కే . నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి ఎడిటర్ ( 7013260176, 9848025451)
-సీఐటీయూ జిల్లా కార్యదర్శి ముంజం శ్రీనివాస్
ఆసిఫాబాద్,(ఆరోగ్యజ్యోతి): ఆశా కార్యకర్తలకు రూ.రూ.10 వేల వేతనం చెల్లించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ముంజం శ్రీనివాస్ డిమాండ్ చేశారు. పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని సోమవారం సీఐటీయూ ఆధ్వర్యంలో డీఎంహెచ్‌వో కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుటుంబ సర్వే వివరాలను పాత పద్ధతిలోనే కొనసాగించాలని అన్నారు. అంతకు ముందు ర్యాలీగా డీఎంహెచ్‌వో కార్యాలయానికి చేరుకున్నారు. ఈకార్యక్రమంలో ఆశా యూని యన్ నాయకులు పద్మ, స్వరూప, వనిత, సకృబాయి, అనురాధ, సరోజ తదితరులు పాల్గొన్నారు.