దేశంలో 18 వేల కొత్త కరోనా కేసులు

 

న్యూఢిల్లీ,(ఆరోగ్యజ్యోతి): దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. సెప్టెంబర్‌లో లక్షకు చేరువైన పాజిటివ్‌ కేసులు ఇప్పుడు 19 వేల దిగువకు పడిపోయాయి. గత ఆరు నెలల్లో ఇంత తక్కువగా కేసులు నమోదవడం ఇదే మొదటిసారి. దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 18,732 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 1,01,87,850కు చేరాయి. ఇందులో 2,78,690 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 97,61,538 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా వల్ల ఇప్పటివరకు  1,47,622 మంది మరణించారు. నిన్న ఉదయం నుంచి నేటి ఉదయం 9 గంటల వరకు 21,430 మంది మహమ్మారి బారినుంచి బయటపడ్డారు. మరో 279 మంది మరణించారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దేశ వ్యాప్తంగా డిసెంబర్‌ 26 వరకు 16,81,02,657 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎమ్మార్‌) ప్రకటించింది. ఇందులో నిన్న ఒకేరోజు 9,43,368 నమూనాలకు పరీక్షలు చేశామని తెలిపింది.