కే . నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి ఎడిటర్ ( 7013260176, 9848025451)
రాష్ట్రంలో సోమవారం కొత్త కేసులు 491
హైదరాబాద్, (ఆరోగ్యజ్యోతి): రాష్ట్రంలో కొవిడ్ నిర్ధారణ పరీక్షల సంఖ్య సోమవారంనాటికి 62 లక్షలు దాటింది. ప్రతి మిలియన్ జనాభాకు చేసిన పరీక్షల సంఖ్య 1,66,729కి పెరిగింది. సోమవారం 48,005 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయగా.. 491 కొత్త కేసులు నమోదయ్యాయి. 596 మంది కోలుకొని డిశ్చార్జి అయినట్టు మంగళవారం విడుదలచేసిన బులెటిన్‌లో వైద్యారోగ్యశాఖ తెలిపింది. రికవరీ రేటు రాష్ట్రంలో 96.85 శాతానికి పెరిగింది. జాతీయ సగటు 95.1 శాతంగా నమోదైంది. ప్రస్తుతం 7,272 మంది దవాఖానల్లో, హోం క్వారంటైన్‌లో చికిత్స పొందుతున్నారు. సోమవారం అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 102, రంగారెడ్డిలో 35, మేడ్చల్ మల్కాజిగిరిలో 33 కేసులు నమోదయ్యాయి.
సోమవారం నమోదైన కొవిడ్ కేసులు
వివరాలు | సోమవారం | మొత్తం |
పాజిటివ్ కేసులు | 491 | 2,78,599 |
డిశ్చార్జి అయినవారు | 596 | 2,69,828 |
మరణాలు | 3 | 1,499 |
చికిత్స పొందుతున్నవారు | - | 7,272 |