రాష్ట్ర అధ్యక్షులుగా బూర రవి ఏకగ్రీవం

కే . నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి ఎడిటర్ ( 7013260176,9848025451) 

 హైదరాబాద్,(ఆరోగ్యజ్యోతి): తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ - 1926/98 రాష్ట్ర అధ్యక్షులుగా బూర రవి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సెంట్రల్ యూనియన్ ఆఫిస్ కోఠి హైదరాబాద్ లో యూనియన్ స్టేట్ స్టాండింగ్ కౌన్సిల్ మీటింగ్ నిర్వహించారు. రాష్ట్ర కార్యవర్గానికి ఎన్నికలు జరినాయి. ఎన్నికల అధికారి గా మనోహర్ రావు అధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించారు. అధ్యక్షులుగా బూర రవి ఏకగ్రీవంగాఎన్నికకాగా,  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాబర్ట్ బ్రూస్, స్టెట్ వర్కింగ్ ప్రెసిడెంట్ వంతుల అజీమ్ స్టెట్ ,అసోసియేట్ ప్రెసిడెంట్ అరుణ, స్టెట్ చీఫ్ వైస్ ప్రెసిడెంట్ పరంజ్యోతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్యక్రమానికి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాష్ట్రము లోని జిల్లా అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు వివిధ అనుబంధ సంఘాల సభ్యుల సమక్షంలో ఎన్నికలు జరిగినాయి . కార్యక్రమంలో ఆర్గనైజింగ్ సెక్రటరీ బైరపాక శ్రీనివాస్ , కమలాకర్ , రాజేష్ , మషిక్ అలీ , లక్ష్మయ్య , ప్రేమ్ కుమార్ , కుసుబ రాజేష్ , ఓదహలు విజయ్ కుమార్ , సత్యనారాయణ , దయ్యనాధమ్మము , సాంబయ్య , పీ. శ్రీనివాస్ , కాంట్రాక్టు అవుట్ సోర్స్యంగ్ విభాగం నుంచి చైర్మన్ షాకీర్ , కో - చైర్మన్ రామ రాజేష్ ఖన్నా , వైస్ ప్రెసిడెంట్ . సందీప్ కుమార్ , జాయింట్ సెక్రటరీ చిరంజీవి , శ్రీధర్ మరియు అని జిల్లా ప్రెసిడెంట్ , మరియు జిల్లా సెక్రటరీ లు తదితరులు పాల్గొన్నారు.