వ్యాధిగ్రస్థులను ఆదుకునేందుకే ప్రభుత్వ నిధులు

కే . నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి ఎడిటర్ ( 7013260176, 9848025451)

 బోథ్‌,ఆదిలాబాద్, (ఆరోగ్యజ్యోతి): వివిధ రకాల వ్యాధుల బారిన పడి ఆర్థికంగా నష్టపోయిన వారిని ఆదుకునేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి నిధులు మంజూరు చేయడం జరుగుతోందని బోథ్‌ ఎమ్మెల్యే రాథోడ్‌ బాపూరావు పేర్కొన్నారు. సోమవారం బోథ్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 16 మంది లబ్ధిదారులకు మూడు లక్షల 99వేల ఐదువందల రూపాయల చెక్కులను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను ఆదుకునేం దుకు అనేక సంక్షేమ పథకాలను అందిస్తుందన్నారు. ప్రభుత్వానికి ఆర్థిక భారమైనా సంక్షేమ పథకాలకు పెద్దపీట వేస్తుందన్నారు. పాలకులు చేస్తున్న అభివృద్ధిని చూసి ప్రతిపక్షాల వారు ఓర్వలేక విమర్శలు చేయడం తగదన్నారు. ఈ కార్యక్రమంలో బోథ్‌ మండల అధ్యక్షుడు తుల శ్రీనివాస్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ దావుల్ల భోజన్న, మండల పార్టీ కన్వీనర్‌ రుక్మన్‌సంగ్‌, జడ్పీ కో ఆప్షన్‌ సభ్యులు తాహెర్‌బిన్‌ సలాం, మండల కో ఆప్షన్‌ సభ్యులు మహ్మద్‌, ఎంపీటీసీ నారాయణరెడ్డి, ఆత్మ చైర్మన్‌ మల్లెపూల సుభాష్‌ తదితరులున్నారు.