వైద్య సిబ్బందినీ ప్రభుత్వం ఆదుకోవాలి.

    కే . నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి ఎడిటర్ ( 7013260176, 9848025451)



 కాంట్రాక్టు , అవుట్ సోర్స్ యంగ్ ఎన్.ఎచ్.ఎమ్. కో - చైర్మన్ రామ రాజేష్ ఖన్నా

 వరంగల్, (ఆరోగ్యజ్యోతి); నేషనల్ హెల్త్ మిషన్ లో పనిచేస్తున్న వైద్య ఉద్యోగులును సమస్యల్లో ఉన్నారని వారిని ప్రభుత్వం ఆదుకోవాలని కాంట్రాక్టు , అవుట్ సోర్స్ యంగ్ ఎన్.ఎచ్.ఎమ్. కో - చైర్మన్ రామ రాజేష్ ఖన్నా అన్నారు.కరోణ వైరస్ నియంత్రణకు సేవలందిస్తున్న వైద్య సిబ్బందికి ప్రభుత్వం అండగా నిలిచి ఆర్థిక భరోసా కల్పించాలని. కోవిడ్ - 19 వైరస్ నియంత్రణ కొరకు వైద్య ఆరోగ్య శాఖలో నిధులు నిర్వహిస్తున్న , ప్రభుత్వ ఉద్యోగులకు కాంట్రాక్టు , ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వం ఆర్థికంగా అండగా ఉండాలని కోరుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కి గురువరము రోజున పత్రం లేఖ రాయడం జరిగిందిని అయన ఒక ప్రకటనలో తెలిపినారు.  ఈ సందర్భంగా రామ రాజేష్ ఖన్నా మాట్లాడుతూ కొవిడ్ -19 నేపథ్యంలో విధులు నిర్వహిస్తున్న వైద్య సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే 65 శాతం పేమెంట్ తో పిఆర్సి ప్రకటించాలని పెండింగ్లో ఉన్న . డి .ఏ.లు వెంటనే ఇవ్వాలని అలాగే ప్రభుత్వం వెంటనే కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని కోరడం జరుగుతుందన్నారు.వైద్య ఆరోగ్య శాఖ లో పనిచేస్తున్న పట్టణ ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో విధులు నిర్వహిస్తున్న స్టాఫ్ నర్స్ , ఎ.ఎన్.ఎమ్ , మెడికల్ అసిస్టెంట్ , ఫార్మసిస్ట్ , ల్యాబ్ టెక్నీషియన్ , సీ.ఓ , అకౌంటెంట్ అండ్ క్లర్క్ , స్వీపర్ , వాచ్ మెన్ , సిబ్బందిని వెంటనే రెగ్యులర్ చేయాలని అని కోరడం జరుగుతుందన్నారు. వైద్య శాఖలో విధులు నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అందగా నిలవాలి అయన కోరినారు.