కే . నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి ఎడిటర్ ( 7013260176,9848025451)
హైదరాబాద్,(ఆరోగ్యజ్యోతి): వైద్య ఆరోగ్య శాఖలో వివిధ విభాగాల పని చేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించ లని తెలంగాణ మెడికల్ & అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ 905/ 2015 రాష్ట్ర అధ్యక్షులు దుర్గం శ్రీనివాస్ ప్రభుత్వాన్ని కోరినారు. ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖలో గత15,20, సంవత్సరాల నుండి చాలీచాలని జీతాలతో కోవిడ్-19 విపత్తులు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా రాష్ట్రంలో అన్ని డిపార్ట్మెంట్లు సెలవుపై ఉన్నప్పటికీ వైద్య ఆరోగ్య శాఖ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు మాత్రం ప్రజలకు సేవ చేసినారాణి అయన తెలిపినారు.ప్రభుత్వం గుర్తించి వైద్య ఆరోగ్య శాఖలో పని చేస్తున్నా, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల Go,No14 - 2016 లో మూడు స్లాబులు అనగా 12000, 15000, 17,500,గా నిర్ణయించి జీవో విడుదల చేశారరాని స్లాబులు గా నిర్ణయించడం వల్ల అనేక మంది ఉద్యోగులకు అన్యాయం జరిగిందని అయన తెలిపినారు.స్లాబ్ విధానం తొలగించాలని అదేవిధంగా ఇచ్చే జీతాలు కూడా ఏజెన్సీ ల ద్వారా ఇవ్వడం వల్ల ఆ ఏజెన్సీల కాంట్రాక్టర్లు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు PF ,ESI కట్టకుండా నెలల తరబడి జీతాలు ఇవ్వడం లేదన్నారు. ప్రభుత్వం వెంటనే అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలను రద్దు చేసి ప్రభుత్వమే నేరుగావేతనాలు
ఇవ్వాలని
డిమాండ్ చేసినారు. జీవో 14 ను రెన్యువల్ చేస్తూ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కనీస వేతనం 30,000 ఇవ్వాలని మహిళలకు జీతంతో కూడిన ప్రసూతి సెలవులు ఇవ్వాలని సంవత్సరానికి 35 క్యాజువల్ లీవ్ లు ఇవ్వాలని, ప్రభుత్వము రెగ్యులర్ నియామకాలు జరిగినప్పుడు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు వెయిటేజ్ ఇవ్వాలని, గతంలో నియామకమైన అవుట్సోర్సింగ్ ఉద్యోగికి ప్రస్తుతం నియామకమైన ఉద్యోగులకు ఒకే రకమైన వేతనం ఇస్తున్నందున అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రతి సంవత్సరం 2000 వేలు ఇంక్రిమెంట్ ఇవ్వాలలని, తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ ఔట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ కోరుచున్నాము