స్టాఫ్ నర్స్ లో వేతనాలు చెల్లించండి

 

-     సిఐటియు జిల్లా అధ్యక్షులు మల్లేష్

ఆదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి):   రిమ్స్ ఆసుపత్రిలో పనిచేస్తున్న స్టాఫ్ నర్స్ వేతనాలను వెంటనే చెల్లించాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు మల్లేష్ డిమాండ్ చేశారు. రిమ్స్ ఆస్పత్రి ఎదుట రిమ్స్ అవుట్సోర్సింగ్ నర్సింగ్ స్టాప్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు .ఈ ధర్నాకు సిఐటియు మద్దతు పలికినారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడు నెలలుగా పెండింగ్లో ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలన్నారు. కరోన విధులు నిర్వహించిన వారికి 10 శాతం అలవెన్సులు ఇవ్వాలని కోరినారు. కరోన పాజిటివ్ వచ్చిన నర్సులకు ఇంతవరకు వేతనాలు రాలేదని అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కరోన వచ్చినవారికి ముట్టుకోవడానికి భయపడే సమయంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించిన సిబ్బందికి వేతనాలు ఎందుకు చెల్లించడం లేదని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పిఎఫ్  కటింగ్ అవుతున్నప్పటికీ ఇంతవరకు చూపించటం లేదన్నారు. ఆగస్టు మాసంలో కొంతమందికి వేతనాలు పడ్డాయని మరి కొంతమందికి జీతాలు పడలేదు అని తెలిపారు. రిమ్స్ లో పనిచేస్తున్న 157 మంది మూడు నెలల వేతనాలు వెంటనే చెల్లించి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రిమ్స్ అవుట్సోర్సింగ్ నర్సింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అసిమోద్దిన్ ,నరేందర్ రెడ్డి, వైశాలి, దీపా, ఖదీర్, పూర్ణిమ, నీలిమా తదితరులు పాల్గొన్నారు