కొవిడ్‌ వ్యాక్సిన్‌ అందించేందుకు సిద్ధం

 కే . నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి ఎడిటర్ ( 7013260176, 9848025451)

జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ మాలతి

ఖమ్మం (అరోగ్యజ్యోతి): కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ను నిబంధనల మేరకు అందించేందుకు జిల్లా వైద్యఆరోగ్యశాఖ కొవిడ్‌ టీకాల బృందం సిద్ధంగా ఉందని డీఎంహెచ్‌వో డాక్టర్‌ మాలతి తెలిపారు. కొవిడ్‌ వ్యాక్సిన్‌ పంపిణీపై రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ అధికారులు సోమవారం నిర్వహించిన జూమ్‌ వీడియో కాన్ఫరెన్స్‌ శిక్షణలో డీఎంహెచ్‌వో డాక్టర్‌ మాలతి పాల్గొని జిల్లాలో తీసుకున్న కార్యాచరణను వివరించారు. తొలి విడతలో వైద్యఆరోగ్యశాఖ డాక్టర్లు, ఉద్యోగులు, పోలీసుశాఖ, మున్సిపల్‌ ఉద్యోగులతో పాటుగా 50ఏళ్లు దాటిన వృద్ధులకు టీకాలు అందించేందుకు కార్యాచరణ చేస్తున్నామని వివరించారు. కొవిడ్‌ శిక్షణలో లబ్ధిదారులను కొవిడ్‌ యాప్‌లో నమోదు చేయటం, జిల్లా స్థాయి ప్రణాళికలు, కొల్డ్‌ చైన్‌ సిస్టం నిర్వహణ, సురక్షిత టీకా విధానం, టీకాల వ్యర్థాలు సురక్షతంగా తొలగింపు, వ్యాక్సిన్‌ తీసుకున్న వారి వివరాలు నమోదు వరకు రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ అధికారులు శిక్షణ ఇచ్చారు. జిల్లా టీకాల అధికారి డాక్టర్‌ అలివేలు, ఇన్‌చార్జ్‌ డెమో ప్రమీల, డాక్టర్‌ శ్రీకాంత్‌, డాక్టర్‌ సురేశ్‌, డాక్టర్‌ నవ్యకాంత్‌, ఎస్‌డీపీవో నీలోహాన, డిప్యూటీ డెమో వై సాంబశివారెడ్డి,  డీవీఎల్‌ఎం సీహెచ్‌ రమణ, వీసీసీఎం జనార్ధన్‌, ఆర్‌ఎం టీ రామకృష్ణ, డీడీఎం నాగరాజు శిక్షణలో పాల్గొన్నారు.