రోగులకు మెరుగైన వైద్య సేవలు

     కే . నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి ఎడిటర్ ( 7013260176, 9848025451)

  • రోగులకు మెరుగైన సేవలు
  • కుమ్రం భీం ఆసిఫాబాద్‌ డీఎంహెచ్‌వో కుమ్రం బాలు

ఆసిఫాబాద్‌: ప్రభుత్వ దవాఖానల్లో రోగులకు మెరుగైన సేవలందిస్తున్నట్లు డీఎంహెచ్‌వో కు మ్రం బాలు అన్నారు. జిల్లా కేంద్రంలోని విశ్రాం త ఉద్యోగుల సంఘం భవనంలో విశ్రాంత ఉ ద్యోగుల 39వ వార్షికోత్సవంలో గురువారం ఆ యన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడు తూ త్వరలోనే జిల్లాలోని దవాఖానలకు డయాలసిస్‌ మిషిన్‌ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. ‘ఆలన’ పథకం ద్వారా వాంకిడి, ఆసిఫాబాద్‌ మండలాల్లోని గ్రామాల్లో నిత్యం వైద్య సిబ్బంది పర్యటిస్తున్నారని తెలిపా రు.ఇటీవల ఖైర్‌గాంకు చెందిన వైష్టవి ఎంబీబీఎస్‌ సీటు సాధించడంతో వైద్యాధికారి జ్ఞాపిక అందజేసి, అభినందించారు. అనంతరం సీనియర్‌ సిటిజన్స్‌ ప్రతినిధులు హుస్సేన్‌, వామన్‌రావు, సర్దార్‌ఖాన్‌, లూర్ట్‌రెడ్డి, శ్యాంరావును ఘ నంగా సన్మానించారు. విశ్రాంత ఉద్యోగుల సం ఘం జిల్లా అధ్యక్షుడు కర్ణాగౌడ్‌, ప్రధాన కార్యద ర్శి సదానందం, నారాయణ, నర్సింహారావు, ర మేశ్‌, నాగయ్య, తదితరులు పాల్గొన్నారు.