స్టాఫ్ నర్సుల నియామకాల్లో జాప్యం ఎందుకు

 

కే . నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి ఎడిటర్ ( 7013260176, 9848025451)


నేటికీ విడుదల కానీ మెరిట్ లిస్ట్- ఆందోళనలో అభ్యర్థులు.

అవకతవకలపై నత్తనడకన కమిటీ విచారణ

 హైదరాబాద్,(ఆరోగ్యజ్యోతి); ఇటీవల స్టాఫ్ నర్సుల నియామక ఆర్డర్స్ ఇస్తామని ప్రభుత్వం లిస్టు కూడా విడుదల చేసింది .అందులో చాలావరకు అవకతవకలు తప్పులు ఉన్నాయని అభ్యర్థులు ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడం వల్ల ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది .రెండు వారాల్లో కమిటీ నివేదిక ప్రభుత్వానికి ఇవ్వాలని సూచించింది. కానీ ఇప్పటివరకు ప్రభుత్వం తరఫున ఎలాంటి స్పందన రాలేదు. ప్రభుత్వం ప్రకటించిన తర్వాత చాలా మంది స్టాఫ్ నర్సులు వారు చేస్తున్న ప్రైవేటు జాబు రాజీనామా చేసి ఆర్డర్ ఇస్తారని ఆశిస్తూ వచ్చారు. కానీ వారికి నిరాశే మిగిలింది. ప్రభుత్వం రెండు మూడు వారాల్లో మార్పులు ఇతర సమస్యలను పరిష్కరించాల్సి ఉందని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ఇప్పటివరకు ప్రభుత్వం ఇవ్వలేక పోతోంది .

2020 సెప్టెంబర్ నెలలో కోర్టు తీర్పు వెలువడిన తరువాత ఫలితాలు విడుదలమొదటి మెరిట్ లిస్ట్ లో తమ నంబర్ ఉందని ప్రవేటు వైద్యశాల లో తాము చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసిన అభ్యర్థులు ( సర్టిఫికెట్ వెరిఫికేషన్ తేదీ కూడా ప్రకటించారు.)కొంత మంది విదేశాలలో ఉన్న అభ్యర్థులు తమ నంబర్ మెరిట్ లిస్ట్ లో ఉందని విదేశాల నుండి తమ ఉద్యోగాలకు  రాజీనామా చేసి రాష్టానికి వచ్చేశారు. ఇప్పుడు జీతాలు లేక ఇళ్ళు అద్దెలు కట్టలేక కుటుంబ పోషణ భారంగా మారింది. కొంత మంది అభ్యర్ధుల వయోపరిమితి కూడా ఐపోతున్నది. వైద్యారోగ్యశాఖలో నర్సింగ్‌ పోస్టుల భర్తీ ఒక అడుగు ముందుకు...రెండడుగులు వెనక్కి అన్నట్టుగా తయారైంది. పోస్టులు ఖాళీ అయ్యాక ఏండ్లు గడిస్తే తప్ప నియామక ప్రకటన ఇవ్వరు. తీరా నోటిఫికేషన్‌ ఇచ్చినా పలితాలు రావు  వచ్చిన ఏళ్లతరబడి ఏవేవో కారణాలతో నియామకాలు చేపట్టక అబ్యర్తులను  ఇబ్బంది పెడుతున్నారే తప్ప ఉద్యోగాలు రావు. ఇది స్టాఫ్‌ నర్సుల విషయంలో జరిగిన అన్యాయం. వివరాలు ఈలా ఉన్నాయి...

వైద్యారోగ్యశాఖ 2017లో 4,300 పారామెడికల్‌, నర్సింగ్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను ప్రభుత్వం ఇచ్చినది . వీటిలో 3,311 స్టాఫ్‌ నర్సులు, మిగిలినవి పారామెడికల్‌ పోస్టులున్నాయి. ఈ పోస్టుల భర్తీలో కాంట్రాక్టు నర్సులకు అత్యధికంగా 30 శాతం వరకు అంటే 65 మార్కులు కలిపేందుకు జీవో నెంబర్‌ 166ను జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం.....ఆరు నెలల సర్వీసు ప్రాతిపదికన గిరిజన ప్రాంతాల్లో పని చేసిన వారికి నాలుగు, గ్రామీణ ప్రాంతాల్లో రెండు, పట్టణ ప్రాంతాల్లో అయితే ఒక మార్కుచొప్పున వెయిటేజీ ఇవ్వనున్నట్టు నోటిఫికేషన్లోనే వివరంగా ప్రకటించారు. ఒప్పంద ఉద్యోగుల నియామకాల్లో రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ (ఆర్‌ వో ఆర్‌) పాటించలేదనీ, వెయిటేజీ కల్పించడం రాజ్యాంగ విరుద్ధమంటూ దీనిపై కొంత మంది నిరుద్యోగ అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై కోర్టు కౌంటర్‌ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే ఉన్నతాధికారులు ఉద్దేశపూర్వకంగానే కౌంటర్‌ దాఖలు చేయడంలో తాత్సారం చేస్తున్నారని నిరుద్యోగ సంఘాలు విమర్శించాయి. ఎట్టకేలకు కౌంటర్‌ దాఖలు చేయడంతో సుదీర్ఘ విచారణ తర్వాత నియామకాలను చేపట్టేందుకు హైకోర్టు అనుమతిస్తూ తీర్పునిచ్చింది.హైకోర్టు క్లియరెన్స్‌ ఇచ్చినప్పటికీ వెంటనే భర్తీ కావాల్సిన చేయాల్సిన పోస్టుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో అనర్హులను ఎంపిక జాబితాలో చేర్చారనే ఆరోపణలు వచ్చాయి.ఇదే విషయంపై ప్రజాసంఘాలు, ప్రతిపక్షాల నుంచి విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సర్కారు ప్రత్యేకంగా ఒక విచారణ కమిటీని నియమించింది. రెండు వారాల్లో నివేదిక సమర్పించాలని ఆ కమిటీని ఆదేశించింది. నవంబర్‌ 13న నియమించిన ముగ్గురు సభ్యులతో కూడిన ఆ కమిటీ ఇంకా పనిని పూర్తి చేయలేదు. నియామక ప్రక్రియ మరింత జాప్యం జరిగే అవకాశం ఉందని సమాచారం.అప్పటికే ఉన్న ఖాళీలు, మరోవైపు కరోనాతో పెరిగిన అదనపు సిబ్బంది అవసరాన్ని పరిగణనలోకి తీసుకుని యుద్ధప్రాతిపదికన చేపట్టాల్సిన నియామకాలు కాస్తా సర్టిఫికేషన్‌ వెరిఫికేషన్‌ సరిగ్గా చేయకపోవడంతో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. మరింత ఆలస్యామయ్యే  అవకాశం ఉంది. 3800 మంది వెయిటేజీ కోసం దరఖాస్తు చేసుకోగా అందులో 1823 మందికి వెయిటేజీకి అర్హులుగా నిర్ణయించారు. మిగతా దరఖాస్తులను తిరస్కరించారు. వెయిటేజీకి అర్హులుగా నిర్ణయించిన వారిలో పలువురు అనర్హులున్నట్టు ఫిర్యాదులు రావడంతోనే సర్కారు విచారణ కమిటీని నియమించింది. కోర్టు కేసులతో కాలయాపన కాగా, ప్రస్తుతం కమిటీ విచారణ పేరుతో జాప్యం జరుగుతుండడంతో ఈ ఏడాదైనా పోస్టులు భర్తీ అవుతాయా? అనే అనుమానం వ్యక్తమవుతున్నది. అధికారులు నిర్ణయించిన అర్హుల జాబితాలో అనర్హులు ఉన్నట్టే, తిరస్కరించిన దరఖాస్తులు దాదాపు 2000 వరకున్నాయి. వారిలో  అర్హులుంటే వాటినీ పరిశీలించాల్సి ఉంటుంది. దీంతో మొత్తం ప్రక్రియలో మరింత ఆలస్యం జరిగే అవకాశాలు లేకపోలేదు.

వెయిటేజీ మార్కులు కలపాలి

 రాణి స్టాఫ్ నర్స్( నిజామాబాదు)

ప్రభుత్వం కొంతమందికి వెయిటేజీ మార్కులు కలిపిందని మరి కొంతమందికి కలవకపోవడం వల్ల కొంతమందికి న్యాయం జరిగినప్పటికీ మరికొంతమందికి అన్యాయం జరిగిందని ప్రభుత్వం ఒకసారి ఇ ఆప్షన్ ఇచ్చి మళ్లీ ఫలితాలను ప్రకటించి అడ్రస్ వారం రోజుల్లోగా ఇవ్వాలని ఆమె కోరింది. ఆర్డర్ కాపీ కొరకు కొన్ని సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్నామని వెంటనే ఇవ్వాలని ఆమె కోరారు.

వెయిటేజీ మార్కులు కలపాలి

కవిత , స్టాఫ్ నర్స్ (నల్గొండ )

ప్రభుత్వం కొంతమందికి వెయిటేజీ మార్కులు కలిపిందని మరి కొంతమందికి కలవకపోవడం వల్ల కొంతమందికి న్యాయం జరిగినప్పటికీ మరికొంతమందికి అన్యాయం జరిగిందని ప్రభుత్వం ఒకసారి ఇ ఆప్షన్ ఇచ్చి మళ్లీ ఫలితాలను ప్రకటించి అడ్రస్ వారం రోజుల్లోగా ఇవ్వాలని ఆమె కోరింది. ఆర్డర్ కాపీ కొరకు కొన్ని సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్నామని వెంటనే ఇవ్వాలని ఆమె కోరారు