నిజామాబాద్‌ వైద్యుడికి ఐఎంఏ అవార్డు

 నిజామాబాదు:ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ జాతీయ అవార్డుకు నిజామాబాద్‌ జిల్లాకు చెందిన వైద్యుడు, ఐఎంఏ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ ఆకుల విశాల్‌ ఎంపికయ్యారు. ఉత్తమ సేవలు అం దించిన వైద్యులకు ఏటా ఐఎంఏ ద్వారా జాతీయ అవార్డులు అందిస్తారు. ఈ నెల 18న ఐఎంఏ జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ రాజన్‌శర్మ చేతుల మీదుగా విశాల్‌ ఈ అవార్డు అందుకోనున్నారు.