కడ్తాల్ : పేదల ఆరోగ్యానికి ప్రభుత్వం భరోసా కల్పిస్తుందని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ అన్నారు. మండల పరిధిలోని ముద్విన్ గ్రామానికి చెందిన మహేశ్, చరణ్ అనారోగ్యంతో బాధపడుతూ, హైదరాబాద్‌లోని ప్రైవేట్ దవాఖానల్లో చికిత్స పొందారు. చికిత్స అనంతరం ఇద్దరు వైద్య ఖర్చుల కోసం సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకోగా, ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ సహకరించడంతో మహేశ్‌కు రూ.28వేలు, చరణ్‌కు రూ.14 వేలు మంజూరయ్యాయి. శనివారం హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లబ్ధిదారులకు జైపాల్‌యాదవ్ సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నిరుపేదలకందరికి మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. సీఎం రిలీఫ్ ఫండ్ పథకం పేదలకందరికి వరంలా మారిందని, ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరిని సీఎం కేసీఆర్ ఆదుకుంటారన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్‌గుప్తా, ఉప సర్పంచ్ వినోద్, నాయకులు నాలపురం శ్రీనివాస్‌రెడ్డి, ఇర్షాద్, జంగయ్య, భాస్కర్‌రావు పాల్గొన్నారు.