జిల్లాలో త్వరలో కుని ఆపరేషన్లు

 

జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరేందర్

 ఆదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి) :జిల్లా వ్యాప్తంగా త్వరలో కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు తొందరలో అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రారంభించనున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరేందర్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కొన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఎంపిక చేయడం జరిగిందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. గతంలో కుటుంబ నియంత్రణ చేసిన కొన్ని ఆపరేషన్ థియేటర్లు శిథిలావస్థకు చేరడంతో,ఈ సారి కొత్త  ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఎంపిక చేయడం జరిగిందని మాత్రమే ఎంపిక చేసి త్వరలో కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు ప్రారంభించనున్నట్లు తెలిపారు. కేసులను అనుసరించి ఏ ఏ వారాల్లో తేదీల్లో ఏ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు చేయాలని విషయం  అక్కడి వైద్య అధికారి నిర్నహిస్తారని వైద్య అడిక్లారి సూచనల మేరకు అక్కడ క్యాంప్  నిర్వహించడం జరుగుతుందని అన్నారు . ప్రస్తుతం జైనథ్, తాంసి, భీంపూర్, ఇచ్చోడ, బజారత్నూర్ , నార్నూర్, భోత్, ఉట్నూర్  ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు చేసే ఎందుకు చేసేందుకు ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో థియేటర్లను ఎంపిక చేయడం జరిగిందన్నారు .ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తొందరగా కుటుంబ నియంత్రణ జరుగుతాయని తెలిపారు .సంబంధిత ఆరోగ్య కార్యకర్తలు , హెల్త్  అసిస్టెంట్లు ఆశా కార్యకర్తలు ఇప్పటి నుండే కుటుంబ నియంత్రణ కొరకు పేర్లు  నమోదు చేసుకోవాలని తెలిపారు వారి వారి పేర్లను తమ వద్ద ఉంచుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సూచించారు, ఈ కార్యక్రమంలో డిప్యూటి డియంఎహ్ఓ  డాక్టర్ సాదన  జిల్లా సర్వైలెన్స్ అధికారి డాక్టర్ వై సి శ్రీనివాస్. ఇన్చార్జ్ అడిషనల్ డి ఎం అండ్ హెచ్ వో జిల్లా లెప్రసీ మరియు ఎయిడ్స్ నివారణ అధికారిప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యులు డాక్టర్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.