కే . నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి ఎడిటర్ ( 7013260176, 9848025451)
హైదరాబాద్(ఆరోగ్య జ్యోతి): కేన్సర్ కణతితో బాధపడుతున్న ఓ మహిళ గుంటూరులోని ఒమెగా ఆస్పత్రి వైద్యులు శస్త్రచికిత్స చేసి దాన్ని తొలగించారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన నజిమా బేగం(33) నాలుగేళ్లుగా రొమ్ములో కేన్సర్ కణితితో బాధపడుతోంది. రెండేళ్ల క్రితం శస్త్ర చికిత్స చేసినా మళ్లీ కణితి రావడంతో ఆమె గుంటూరులోని ఒమెగా ఆస్పత్రిలో చేరారు. చీఫ్ సర్జికల్ అంకాలజిస్టు డాక్టర్ ఎంజీ నాగకిషోర్ బృందం బుధవారం శస్త్రచికత్స చేసి కణతిని తొలగించారు. ఈ సందర్భంగా నాగకిషోర్ మాట్లాడుతూ.. ఇంత పెద్ద సైజ్‌లో క్యాన్సర్ కణితి రోమ్ములో అభివృద్ది చెందడం అత్యంత అరుదన్నారు. కణతి ఆరు కిలోల బరువు ఉందన్నారు. కార్యక్రమంలో డాక్టర్లు శౌరయ్య, మెడికల్ ఆంకాలజిస్టు శ్రీకాంత్ బోగా, రేడియేషన్ ఆంకాలజిస్టు జాస్తి విజయకృష్ణ, ఎన్‌వీఎ్‌స ప్రవీణ్ పాల్గొన్నారు.