పైలేరియాపై ఇంటింటా సర్వే చేయాలి

    కే . నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి ఎడిటర్ ( 7013260176, 9848025451)

ఆసిఫాబాద్‌ (ఆరోగ్యజ్యోతి)‌: బోదకాలు(పైలేరియా) వ్యాధిగ్రస్తులను గుర్తించేందుకు ఇంటింటా సర్వే నిర్వహించాలని వైద్య అధికారులు, సిబ్బందిని కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లా డీఎంహెచ్‌వో కుమ్రం బాలు ఆదేశించారు. బోదకాలు వ్యాధి నిర్ధారణ పరీక్షలపై బుధవారం డీఎంహెచ్‌వో కార్యాలయంలో జిల్లాలోని సూపర్‌వైజర్లు, వైద్య సిబ్బందికి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ఈ నెల 18 నుంచి 21వరకు ఇంటింటా సర్వే నిర్వహించాలన్నారు. ఈ సర్వే రాత్రి 8 గంటల నుంచి 12 గంటల వరకు నిర్వహించాలని సిబ్బంది సూచించారు. బోదకాలుతో జ్వరం రాత్రి పూటనే వస్తుంది కావున ఆ సమయంలోనే అనుమానితుల రక్త నమూనాలను సేకరించాలని సుచించారు. కౌటాల మండలం మొగడ్‌ దగడ్‌, వాంకిడి మండలం ఖమాన, కాగజ్‌నగర్‌లోని బట్టుపల్లి, నవేగాం, చింతలమానేపెల్లి మండలం బాలాజీఅనుకోడ, సిర్పూర్‌ టీ లోని లోనవెల్లి గ్రామాల్లో తప్పనిసరిగా సర్వే చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌వో సుధాకర్‌ నాయక్‌, ప్రోగ్రాం అధికారి అశోక్‌ తదితరులున్నారు.