వైద్య పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

  కే . నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి ఎడిటర్ ( 7013260176, 9848025451)

నాగర్కర్నూల్: ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ తెలంగాణ హైదరాబాద్‌ వారి ఆదేశానుసారం జిల్లాలోని ఏడు వైద్య పోస్టుల భర్తీకి ఆమోదం లభించిందని డీఎంహెచ్‌వో సుధాకర్‌లాల్‌ సోమవారం ప్రకటనలో తెలిపారు. అర్హులైన సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌లు దరఖాస్తు చేసుకోవాలని.. ఆరు నెలల పాటు కాంట్రాక్టు ప్రాతిపదికపైన ఉంటుందన్నారు. ఆసక్తి గల వారు ఈనెల 21వ తేదీలోగా nagarkurool.telangana.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.