హైదరాబాద్,(ఆరోగ్యజ్యోతి):
వైద్య ఆరోగ్య శాఖ లోని రెగ్యులర్ ఎంప్లాయిస్ సమస్యలతోపాటు కాంట్రాక్టు ఉద్యోగుల
సర్వీసులను రెగ్యులర్వే చేయాలని, వేతనాల పెంపుదల
తదితర సమస్యల పైన ఉన్నతాధికారులకు భూపాల్ రాష్ట్ర అధ్యక్షలు ఆధ్వరాయంలో శుక్రవారం రోజు రాష్ట్ర కమిటీ అద్వర్యంలో
వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ విభాగం కమిషనర్ కరుణ వాకాటి వినతిపత్రం ఇవ్వడం జరిగింది . తెలంగాణ యునైటెడ్
మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో
వైద్య ఆరోగ్య మరియు
కుటుంబ సంక్షేమ విభాగం కమిషనర్ కరుణ వాకాటి ను కలిసి పలు సమస్యలను వివరించడం జరిగినది . ముఖ్యంగా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్
లోని వైద్య విధాన
పరిషత్ ఉద్యోగుల ప్రమోషన్లు ఇవ్వాలని, సర్వీస్ సమస్యలపై వినతిపత్రం ఇవ్వడం జరిగింది .అలాగే
104 సేవలు రాష్ట్రంలో
చాలా మందకొడిగా
నడుస్తున్నాయని . 198 వాహనాలలో సగం
వాహనాలు పనిచేయటం లేదని .సిబ్బంది సమస్యలు
పరిష్కరించడం లేదని . గత అనేక నెలలుగా డి ఎ చెల్లించడం లేదు. కొత్త జిల్లాలు
ఏర్పాటు తర్వాత స్థానికత ఆధారంగా
బదిలీలు చేయాలని కోరినారు. 104 వాహనాల్లో సరిపడా మందులు గాని, సౌకర్యాలు గాని లేవని .సగం వాహనాలు రిపేర్ లో ఉన్నాయని . సేవలు మెరుగుపరచాలని ఈరోజు కమిషనర్ గారిని కలిసి విజ్ఞప్తి చేయడం జరిగింది .పరిష్కారానికి
కృషి చేస్తానని హామీ ఇచ్చారు .రంగారెడ్డి జిల్లాలో 104 పోస్టుల భర్తీలో అక్రమాల విషయమై దృష్టికి
తీసుకురావడం జరిగింది ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు v. మరియమ్మ ,రాష్ట్ర కార్యదర్శి v. విజయ వర్ధన్ రాజు
, వివిధ జిల్లాల నాయకులు విజయ్, రావుల్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు .