హైదరాబాద్,(ఆరోగ్యజ్యోతి): ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో మేనేజ్‌మెంట్ కోటా కింద ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లోప్రవేశాలు కోరుతూ కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. నీట్ యూజీ -2020లో అర్హత సాధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని ప్రకటించింది.అభ్యర్థులు డిసెంబర్ 1వ తేదీన ఉదయం 8 గంటల నుంచి 7వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. మరింత సమాచారానికి యూనివర్సిటీ వెబ్‌సైట్ www .knruhs.telangana.gov.inను సంప్రదించాలని యూనివర్సిటీ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి.