తాంసీ ,ఆదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి); తాంసీ
ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కోవిడ్ 19 వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాని
బోథ్ ఎమ్మెల్యే
రాథోడ్ బాపురావు సోమవారంనాడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన
మాట్లాడుతూ కరోనా
వ్యాక్సినేషన్ ప్రారంభంలోనే వ్యాక్సిన్‌ను తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది.
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన వ్యాక్సిన్ రావడంతో ఇక కరోనా భయం పోయింది. అందరూ
వ్యాక్సిన్ వేసుకునేందుకు ముందుకు రావాలని అయన కోరినారు. తన నియోజక వర్గంలో లోని
తాంసీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కోవిడ్ 19 వ్యాక్సిన్ రావడం ఎంతో సంతోష
కరమైన విషయం అన్నారు. అనతరం అడిషనల్ డిఎంఅండ్హెచ్ఓ మరియు జిల్లా లెప్రసీ
ఎయిడ్స్ అధికారి ,ప్రాథమిక
ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ శ్రీకాంత్ మాట్లాడుతూ తొలి
టీకాను వైద్య సిబ్బందికి
ఇచ్చామన్నారు. వ్యాక్సిన్
తీసుకున్న వారికి ఎలాంటి దుష్ఫలితాలు తలెత్తవని తెలిపినారు. వ్యాక్సిన్
తీసుకున్న వారికిఅర గంట పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉంచుతామన్నారు.
ప్రస్తుతం 85 కోవిడ్
19 వ్యాక్సిన్ రావలసి ఉండగా, 70 కోవిడ్ 19 వ్యాక్సిన్ వచిన్దన్నారు. ఈ
కార్యక్రమంలో జెడ్
పి టి సి తాటి పెళ్లి రాజు, ఎంపీపీ మంజుల శ్రీధర్ రెడ్డి ,యం పి డి ఓ ఆకుల భూమయ్య, తాసిల్దార్
సంధ్య రాణి,
స్థానిక
సర్పంచ్ స్వప్న రత్న ప్రకాష్, మండల కన్వీనర్ పులి నారాయణ, వైస్ ఎంపీపీ మచ్చ రేఖ రఘు, ఎంపిటిసి
వెన్నెల నరేష్ పండిత, మాజీ ఎంపీపీ అరుణ్ కుమార్ గారు సీనియర్ నాయకులు సామ నాగరెడ్డి , వైద్య సిబ్బంది
సర్పంచులు ఎంపిటిసిలు నాయకులు కార్యకర్తలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.