కే. . నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక ఎడిటర్ ( 7013260176 9848025451)
తాంసీ,ఆదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి): తాంసీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో
సోమవారం నాడు కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ చేస్తున్నట్లు అడిషనల్
డిఎంఅండ్హెచ్ఓ మరియు జిల్లా లెప్రసీ ఎయిడ్స్ అధికారి ,ప్రాథమిక ఆరోగ్య
కేంద్రం వైద్యాధికారి డాక్టర్ శ్రీకాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10-30 గంటలకు కోవిడ్-19 వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు ఆయన సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమానికి
ముఖ్యఅతిథిగా బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు హాజరవుతున్నట్లు ఆయన తెలిపారు.
మొదటగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బందికి కోవిడ్-19 వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుందని వైద్యాధికారి వివరించారు.