కొవిడ్‌-19 నివారణ వ్యాక్సిన్‌పై అపోహ వీడాలి

 కే.నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక  ఎడిటర్ ( 7013260176  9848025451)

-      వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్  

హుజూరాబాద్,(ఆరోగ్యజ్యోతి):   ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కొవిడ్‌ వైరస్‌ నియంత్రణ కోసం సకాలంలోనే వ్యాక్సిన్‌ ప్రజలందరికి అందుబాటులోకి రావడం హర్షణీయమని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్  అన్నారు. హుజూరాబాద్ ఏరియా ఆస్పత్రిలో కరోనా వాక్సినేషన్ కార్యక్రమం ను కోవిడ్‌షీల్డ్‌ వ్యాక్సిన్‌ను ఆరోగ్య ఉద్యో గులకు పంపిణీ కార్యక్రమాన్ని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్  బుదవారం నాడు  పరిశీలించినారు.ఈసందర్భంగా అయన  మాట్లాడుతూ.. దా దాపు 10 నెలలకు పైగా కరోనా కారణంగా కుటుంబ సభ్యులను సైతం చూడలేని పరిస్థితులు నెలకొన్నాయన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సైతం ఆరోగ్య ఉద్యోగులు, పారిశుధ్య సిబ్బంది, పోలీసులు సాహసోపేతంగా విధులు నిర్వహించి ప్రజలకు, రోగులకు సేవలు అందించిన తీరు సంతోషకరమన్నారు. వైరస్‌ను నియంత్రించడానికి శాస్త్రవేత్తలు రేయింబవళ్ళు కష్టపడి తక్కువ కాలంలోనే టీకాను అందుబాటులోకి తీసుకురావటం అభినందనీయన్నారు. తొలుత ఆరోగ్య శాఖ ఉ ద్యోగులకు టీకా ఇస్తున్న ప్రభుత్వం త్వరగా ప్రజలందరికి టీకాను ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు.