కొవిడ్‌-19 టీకాను అందరు తీసుకోవాలి

 

వరంగల్, (ఆరోగ్యజ్యోతి): పోర్ట్ వరంగల్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ లో కరోనా వారియర్స్ కోవిడ్ -19 కోవిషీల్డ్ వ్యాక్సిన్ మొదటి టీకాను  కార్పొరేటర్లు బిళ్ళ శ్రీకాంత్ కవిత , దామోదర్ యాదవ్ లు ప్రారంబించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనాతో పోరాడిన వైద్య సిబ్బందికే తొలి టీకా వేయడం అభినందనీయమన్నారు. కొవిడ్‌-19  టీకాతో ఇప్పటి వరకు ఎలాంటి దుష్ప్రభావాలు లేవన్నారు.  కార్యక్రమంలో వైద్య అధికారి   డాక్టర్ అనురాధ , కార్పొరేటర్ లు బిళ్ళ శ్రీకాంత్ కవిత, దామోదర్ యాదవ్, స్టాప్ నర్స్ రదపాక భాగ్య లక్ష్మి , శిరీష ,అకౌంటెంట్ అభిషేక్ , ల్యాబ్ టెక్నీషియన్ రాజేష్ గౌడ్ , ఏ.ఎన్.ఎమ్.లు , కోమల , రాణి , భవాని , రేష్మ , ఫార్మసిస్ట్ స్పందన , మెడికల్ అసిస్టెంట్ మాధవ్ ,అంగన్వాడి, ఆశ కార్యకర్తలు  తదితరులు పాల్గొన్నారు.