3 కోట్ల మందికి ఉచితంగా టీకా

 

కే. . నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక  ఎడిటర్ ( 7013260176  9848025451)

న్యూఢిల్లీ, (ఆరోగ్యజ్యోతి); వ్యాప్తంగా తొలి విడుతలో 3 కోట్ల మందికి ఉచితంగా కరోనా టీకా అందజేస్తామని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌ వెల్లడించారు. కరోనా వ్యాక్సిన్‌ భద్రత, సామర్థ్యంపై దుష్ప్రచారాన్ని నమ్మొద్దని దేశ ప్రజలను కోరారు. వ్యాక్సిన్‌కు అనుమతిచ్చే విషయంలో ఏ ప్రొటోకాల్‌పైనా రాజీపడలేదని స్పష్టంచేశారు. శనివారం ఢిల్లీలో కరోనా వ్యాక్సిన్‌ డ్రై రన్‌ను ఆయన సమీక్షించారు. అనంతరం మాట్లాడుతూ.. తొలి విడుతలో కోటి మంది వైద్య ఆరోగ్య సిబ్బందికి, మరో రెండు కోట్లమంది ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు ఉచితంగా టీకా అందిస్తామని చెప్పారు. ప్రాధాన్యత క్రమంలో మరో 27 కోట్లమందికి ఏ విధంగా టీకా అందించాలన్నదానిపై కసరత్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ మెగా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ నిర్వహించడంలో దేశ శక్తిసామర్థ్యాలపై సందేహాలను ఆయన కొట్టివేశారు. వ్యాక్సినేషన్‌లో గత అనుభవాలు భారత్‌కు లాభిస్తాయని చెప్పారు.