అత‌ని మృతికి వ్యాక్సిన్‌తో సంబంధం లేదు : ఆరోగ్య శాఖ‌

 

నిర్మ‌ల్(ఆరోగ్యజ్యోతి): కరోనావైరస్‌ను కట్టడి చేసేందుకు భారత్‌లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతోంది.. ఇదే సమయంలో.. ఇతర దేశాల్లో.. భారత్‌లోనూ కొందరు వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత అస్వస్థతకు గురవుతున్నారు. మరికొందరు మృతిచెందారనే వార్తలు కలవరపెడుతున్నాయి.. ఇక, తెలంగాణలోనూ వ్యాక్సినేషన్‌ జరగుతోంది... ఇవాళ వ్యాక్సినేషన్‌ హాలీడేగా ప్రకటించిన సర్కార్‌.. రేపటి నుంచి మళ్లీ వ్యాక్సిన్‌ వేయనుంది.. అయితే, నిర్మల్ జిల్లా కుంటాల మండలం ఒలా గ్రామానికి చెందిన విఠల్ రావు అనే వ్యక్తి మృతిచెందారు.. 108 అంబులెన్స్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్న విఠల్‌రావు.. మంగళవారం రోజు కుంటాల పీహెచ్‌సీలో హెల్త్ కేర్ వ‌ర్క‌ర్ 19వ తేదీన ఉద‌యం 11:30 గంట‌ల‌కు కొవిడ్ టీకా తీసుకున్నాడు20వ తేదీ అర్ధ‌రాత్రి 2:30 గంట‌ల‌కు అత‌నికి ఛాతీలో నొప్పి వ‌చ్చింది. దీంతో కుటుంబ స‌భ్యులు అదే రోజు తెల్ల‌వారుజామున 5:30 గంట‌ల‌కు నిర్మ‌ల్ జిల్లా ఆస్ప‌త్రికి తీసుకొచ్చారు. అప్ప‌టికే ఆ వ‌ర్క‌ర్ చ‌నిపోయిన‌ట్లు వైద్యులు నిర్ధారించారు. అయితే, ఆయన మృతికి కోవిడ్ వ్యాక్సినేషనే కారణమా..? లేదా..? అనేది మాత్రం ఇప్పుడే చెప్పలేమంటున్నారు వైద్యులు. కాగా, వ్యాక్సినేషన్‌కు కొందరు వెనుకడుగు వేయడంపై స్పందించిన నీతి ఆయోగ్.. వ్యాక్సిన్‌ రూపకల్పన వెనుక ఎంతో శ్రమ దాగి ఉందని.. అయితే హెల్త్ కేర్ వ‌ర్క‌ర్ మృతికి క‌రోనా వ్యాక్సిన్‌తో సంబంధం లేద‌ని అధికారులు పేర్కొన్నారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వ‌హిస్తామ‌ని తెలిపారు. ఈ ఘ‌ట‌న‌పై ఓ క‌మిటీ వేసి విచార‌ణ జ‌రుపుతామ‌ని అధికారులు చెప్పారు.