కే. . నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక ఎడిటర్ ( 7013260176 9848025451)
- పండంటి బిడ్డకు జన్మనిచ్చిన స్వప్న
హన్మకొండ(ఆరోగ్యజ్యోతి): నాలుగు నెలలుగా జైలులో శిక్ష అనుభవిస్తున్న
రిమాండ్ ఖైదీ పండంటి పాపకు జన్మనిచ్చింది. వరంగల్ కేంద్ర కారాగారం
సూపరింటెండెంట్ ఎన్ మురళీబాబు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దపల్లి జిల్లా
మంథనికి చెందిన మారుపాడు స్వప్న భర్త హత్య కేసులో అక్టోబర్ 3న వరంగల్ సెంట్రల్ జైలుకు వచ్చింది. అప్పటికే ఆమె గర్భవతిగా ఉండడంతో ప్రతి నెలా
హన్మకొండలోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి(జీఎంహెచ్)లో చెకప్ చేయిస్తున్నారు.
సోమవారం పురుటి నొప్పులు రావడంతో ఆమెను జీఎంహెచ్‌కు తీసుకెళ్లారు. సూపరింటెండెంట్
డాక్టర్ ఆర్ సరళాదేవి రాత్రి 10 గంటలకు ఆమెకు కాన్పు చేయగా పండంటి పాపకు
జన్మనిచ్చింది. జైలు అధికారులు, డీఎంహెచ్‌వో ఎప్పటికప్పుడు ఆమెను
పర్యవేక్షించారు. డీఎంహెచ్‌వో లలితాదేవి, జీఎంహెచ్ సూపరింటెండెంట్ సరళాదేవి, ఆర్‌ఎంవో సారంగం ఆమెను పరీక్షించి అనంతరం కేసీఆర్ కిట్ అందజేశారు. కేసీఆర్
కిట్ అందుకున్న ఆమె ఆనందాన్ని వ్యక్తం చేస్తూ సీఎం కేసీఆర్, జైలు పర్యవేక్షణాధికారి మురళీబాబు, డాక్టర్లకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.