ములుగుకు మరో రెండు అంబులెన్స్‌లు



కే. . నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక  ఎడిటర్ ( 7013260176  9848025451)

ములుగు (ఆరోగ్యజ్యోతి)ప్రతినిధి :  ఆపద సమయాల్లో రోగులను దవాఖానలకు తరలించేందుకు మరో రెండు అంబులెన్స్‌లు జిల్లాకు చేరాయి. మంగపేట మండలం కమలాపురానికి చెందిన రాజ్యసభ మాజీ సభ్యుడు గరికపాటి మోహన్‌రావు తన నిధుల నుంచి వీటిని కొనుగోలు చేసి అందజేశారు. ఇందులో ఒకటి ములుగు జిల్లా దవాఖాన పరిధిలో, మరొకటి ఏటూరునాగారం ప్రభుత్వ దవాఖానలో అందుబాటులో ఉండనున్నాయి. వీటిని ముఖ్య నాయకులు, కలెక్టర్‌, ఐటీడీఏ పీవో చేతుల మీదుగా ప్రారంభించేందుకు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 9 అంబులెన్స్‌ రోగులను ములుగు, ఏటూరునాగారం ప్రభుత్వ దవాఖానలకు తరలిస్తున్నాయి. గరికపాటి అందించిన ఈ అంబులెన్స్‌లు ఐటీడీఏ శాఖ ద్వారా నడపబడనున్నాయి. ఒకటి ములుగు, మరొకటి ఏటూరునాగారం ప్రభుత్వ దవాఖానల వద్ద ఉంచి వరంగల్‌కు రెఫర్‌ చేసే కేసులను తరలించనున్నారు.