వైద్య ఆరోగ్య శాఖ మంత్రి క్యాలెండర్ ఆవిష్కరణ

 హైదరాబాద్ (ఆరోగ్యజ్యోతి): వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలంగాణ పబ్లిక్ హెల్త్ డాక్టర్స్ అసోసియేషన్ ఆదిలాబాద్ జిల్లా యూనియాన్ (టి పి ఎహ్ డిఎ) క్యాలెండర్ ను గురువారంనాడు మంత్రి ఆవిష్కరించారు. అనంతరం డైరెక్టర్ అఫ్ హెల్త్ డాక్టర్ శ్రీనివాస్ క్యాలెండర్ను ను అయన ఆవిష్కరించారు.  ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సంఘానికి సంబంధించిన క్యాలెండర్ ఆవిష్కరించడం సంతోషకరమైన విషయం అన్నారు.రోగుల పై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కత్తి జనార్దన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ పూర్ణ చందర్. జిల్లా అధ్యక్షులు డాక్టర్ శ్రీధర్ మెట్పల్లి వార్. ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎం క్రాంతి కుమార్. కార్యదర్శి డాక్టర్ పవన్. ఉపాధ్యక్షులు డాక్టర్ రాహుల్. డాక్టర్ శ్రీకాంత్ మెట్పల్లి వార్ తదితరులు పాల్గొన్నారు