ఉత్తమ వైద్య సేవలందించాలి : మంత్రి హరీశ్‌రావు

 శామీర్‌పేట(ఆరోగ్యజ్యోతి) : గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ఉత్తమ వైద్య సేవలందించాలని మంత్రి హరీశ్‌రావు అన్నారు. తూంకుంట మున్సిపల్‌లో స్వస్త్‌ చక్ర ఫార్మసీని ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో దవాఖాన ప్రారంభించడం శుభ పరిణామమన్నారు. నైపుణ్యం కలిగిన వైద్యులు అంకితభావంతో గ్రామాల్లోనీ ప్రజలకు సేవలందించాలని సూచించారు. కొవిడ్‌-19 దృష్ట్యా నిబంధనలు తప్పకుండా పాటించాలన్నారు.  కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ కారంగుల రాజేశ్వర్‌రావు, వైస్‌ చైర్మన్‌ వాణివీరారెడ్డి, కౌన్సిలర్లు, టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు నోముల శ్రీనివాస్‌రెడ్డి, దవాఖాన ఎండీ కట్ట కృష్ణకాంత్‌రెడ్డి, ఉప్పు శ్రీకాంత్‌, వైద్యులు  పాల్గొన్నారు.