కే. . నరేష్
కుమార్ ఆరోగ్యజ్యోతి
దిన
పత్రిక ఎడిటర్ ( 7013260176 9848025451)
- డీఎంహెచ్‌వో సుమన్‌మోహన్‌రావు
- వ్యాక్సినేషన్ డ్రై రన్‌పై శిక్షణ
సిరిసిల్ల
,
జనవరి
5:
కొవిడ్
వ్యాక్సినేషన్‌పై అధికారులు ప్రణాళికాబద్ధంగా ముందుకుసాగాలని జిల్లా వైద్యాధికారి
సుమన్‌మోహన్‌రావు పేర్కొన్నారు. మంగళవారం పొదుపు భవన్‌లో జిల్లాలోని ప్రాథమిక
ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులు, సూపర్‌వైజర్లు, ఫార్మసిస్టులు, కోల్డ్ చైన్ హాండ్లర్, ఏఎన్‌ఎంలకు కొవిడ్
వ్యాక్సినేషన్ డ్రై రన్ పై శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముందుగా వైద్య, ఐసీడీఎస్, ఫ్రంట్‌లైన్ వర్కర్స్‌కు
టీకా ఇవ్వనున్నట్లు తెలిపారు. తర్వాత 50 సంవత్సరాల పైబడిన వారికి
వ్యాక్సినేషన్ చేస్తామన్నారు. నిబంధనల ప్రకారం సిబ్బందిని నియమించాలన్నారు.
వ్యాక్సినేషన్ అనంతరం ఏమైనా ఇబ్బందులు ఏర్పడితే వెంటనే చికిత్స అందించేలా
ఏర్పాట్లు చేసుకోవాలని జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డా.మహేశ్ సూచించారు. కో-విన్
యాప్‌లో వ్యాక్సిన్ తీసుకున్న వారి వివరాలు ఏవిధంగా నమోదు చేయాలో డీడీఎం కార్తీక్
వివరించారు. కార్యక్రమంలో వైద్యులు బి.శ్రీరాములు, రజిత, మీనాక్షి, కపిలసాయి, ఉమాదేవి, శ్రీమతి అనిత, వైద్యాధికారులు, ఫార్మాసిస్టులు, సూపర్‌వైజర్లు, ఏఎన్‌ఎంలు పాల్గొన్నారు.
వ్యాక్సినేషన్‌కు
సర్వం సిద్ధం
కరోనా
వ్యాక్సిన్ వేసేందుకు సర్వం సిద్ధంగా ఉన్నట్లు జిల్లా వైద్యాధికారి సుమన్‌మోహన్‌రావు
పేర్కొన్నారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏఎన్‌ఎంలు, ఆశ కార్యకర్తలకు కొవిడ్
టీకా వేసేందుకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వ్యాక్సిన్
వేసేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. అనంతరం కొండాపూర్‌కు చెందిన గంట
లహరికి కేసీఆర్ కిట్ అందజేశారు. ఇక్కడ సీహెచ్‌వో బాలచంద్రం, సూపర్ వైజర్ శ్రీదేవి, ఏఎన్‌ఎంలు, ఆశ కార్యకర్తలు తదితరులు
ఉన్నారు.