వ్యాక్సిన్ ను ప్రతి ఒక్కరు తీసుకోవాలి

 

కే. . నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక  ఎడిటర్ ( 7013260176  9848025451)

ఇచ్చోడ , ఆదిలాబాద్ (ఆరోగ్యజ్యోతి): కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిందని విడతలవారీగా ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అందజేస్తుందని దీన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని MCH ప్రోగ్రాం అధికారి  డాక్టర్ నవ్య సుధ అన్నారు శుక్రవారం నాడు దేశవ్యాప్త చేపట్టిన డ్రైవ్ లో భాగంగా ఆమె ఇచ్చోడ, నర్సాపూర్ -T, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిశీలించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కరోన  వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. బయటకు వెళ్లేటప్పుడు ముందుగా మాస్కులు ధరించి సామాజిక దూరాన్ని పాటించాలని తెలిపారు. ఇంటికి వెళ్లిన వెంటనే సబ్బుతోచేతులు కడుక్కోవాలి అని బయటకు వచ్చిన సమయంలో శానిటైజర్ తో చేతులు శుభ్రం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య అధికారులు డాక్టర్ సాగర్, డాక్టర్ కావ్య, ఆరోగ్య కార్యకర్తలు సంగీత తదితరులు పాల్గొన్నారు.