త్వరలో కొవిడ్‌ టీకా

 

కే. . నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక  ఎడిటర్ ( 7013260176  9848025451)

ఆదిలాబాద్ (ఆరోగ్యజ్యోతి): త్వరలో  కొవిడ్‌ టీకా రానుందని దీన్ని నిల్వచేయడానికి ఐఎల్‌ఆర్‌లను సిద్ధంగా ఉంచామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖా అధికారి  డాక్టర్‌ నరేందర్‌ రాథోడ్‌ తెలిపారు. బుధవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖా అధికారి  కార్యాలయంలోని సమావేశ మందిరంలో  కొవిడ్‌ వ్యాక్సిన్‌ డ్రైరన్‌పై ప్రాథమిక ఆరోగ్య కేంద్ర  వైద్యులు, ఫార్మాసిస్టులు, వైద్య సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. పవర్‌ పాయింట్‌ ప్రాజెక్టర్‌ ద్వారా టీకా వేసే విధానంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖా అధికారి  మాట్లాడుతూ జిల్లాలో డ్రైరన్‌ నిర్వహించడానికి ఇప్పటికే 30 కేంద్రాలను గుర్తించామన్నారు. ఇందులో శుక్రవారం నుంచి నిర్వహించే రన్‌ను విజయవంతం చేయాలని అయన  సూచించారు. జిల్లాలో 22 పీహెచ్‌సీలు, 5అర్బన్‌ సెంటర్లు, 2కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లు, రిమ్స్ లను గుర్తించి వారం రోజుల్లో వచ్చే టీకాలను నిల్వ చేసేలా చర్యలు తీసు కోవడం జరిగిందన్నారు. ఈ మేరకు 150 మంది సిబ్బందిని  కేటాయించినట్లు పేర్కొన్నారు. 6425 మంది ప్రింట్‌లైన్‌ సిబ్బందికి ఈ వ్యాక్సినేషన్‌ ఇవ్వడం జరుగుతుందని ఈ సందర్భంగా అయన తెలిపినారు. . ఈ కార్యక్రమంలో డీఐవో విజయసారథి, ఎన్‌హెచ్‌ఎం కార్యక్రమ అధికారి స్వామి, ఎపడలామజిస్టు అశోక్‌ పాల్గొన్నారు.