TPHDA అద్వర్యంలో నూతన సంవత్సర శుభాకాంక్షలు

 

కే. . నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి ఎడిటర్ ( 70132601769848025451)

ఆదిలాబాద్  (ఆరోగ్యజ్యోతి) :  జిల్లా వైద్య ఆరోగ్య శాఖా అధికారి డాక్టర్ నరేందర్ రాతోడ్  కి    తెలంగాణ పబ్లిక్ హెల్త్ డాక్టర్స్ అసోసియేషన్ ఆదిలాబాద్ యూనిట్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరేందర్ వైద్యులకు మెడికల్ పారామెడికల్ సిబ్బంది అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో వ్యాధులు లేని జిల్లాగా ఆదిలాబాద్ ను తీర్చి దిద్దే బాధ్యత మన అందరిపై ఉందని ఈ సందర్భంగా తెలిపారు. కరోన  సమయంలో  వైద్యులు మెడికల్ పారామెడికల్ సిబ్బంది కూడా ఎంతగానో శ్రమించారు అని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసినారు. అందరి కృషి వల్లనే ఆదిలాబాద్ జిల్లాలో కరోన కేసులుతక్కువగా  నమోదు అవ్తున్నాయని  ఆయన పేర్కొన్నారు మునుముందు కూడా కరోన మాదిరిగానే అన్ని రకాల రోగాలు దరిచేరకుండా ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. త్వరలో జరిగే పల్స్ పోలియో  ఇమేజెస్ ఇన్ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలని సూచించారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన వారిలో తెలంగాణ పబ్లిక్ హెల్త్ డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ శ్రీధర్ మెట్పెల్లి,  ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎం క్రాంతి కుమార్, డాక్టర్ నవ్య ,డాక్టర్ ఆనంద్, డాక్టర్ నిర్మల ,డాక్టర్ సరసిజ తదితరులు పాల్గొన్నారు.