ఆహారం వికటించి వైద్య విద్యార్థులకు అస్వస్థత


-    28 మంది వైద్య విద్యార్థులు అస్వస్థతకు

-    నలుగురితో కమిటికి కలెక్టర్ ఆదేశం

ఆదిలాబాద్‌,(ఆరోగ్యజ్యోతి): ఆహారం వికటించి ఆదిలాబాద్‌ రిమ్స్‌లోని 28 మంది వైద్య విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వైద్య విద్యార్థులు 70 మంది సోమవారం మధ్యాహ్నం ఒంటి గంటకు  క్యాంటీన్‌లో అన్నం, పప్పు, టమాట కూరతో భోజనం చేశారు. ఈ క్రమంలో ఆహారం తీసుకున్న గంట తర్వాత వాంతులు, కడుపునొప్పితో బాధపడ్డారు. వెంటనే సమాచారం అందుకున్న రిమ్స్‌ డైరెక్టర్‌ బలరాం నాయక్‌ వారందరినీ రిమ్స్‌ జనరల్‌ వార్డులో చేర్పించారు. ప్రస్తుతం మెడికోలందరి పరిస్థితి నిలకడగా ఉన్నదని డైరెక్టర్‌ వెల్లడించారు. జరిగిన సంఘటనపై విచారణ చేపట్టామని వివరించారు. అంతకుముందు రిమ్స్‌లో  చికిత్స పొందుతున్న విద్యార్థులను కలెక్టర్ సిక్తా పట్నాయక్, జిల్లా వైద్యాధికారి నరేందర్ రాథోడ్ పరామర్శించారు.

ఈ సందర్భంగా ఆహారం వికటించింది లేక నీటి వల్ల ఈ సమస్య తలెత్తింది అనే కోణంలో పరిశీలిస్తున్నామన్నారు 70 మంది విద్యార్థులు భోజనం చేయగా అందులో 28 మంది విద్యార్థులకు తలనొప్పి వాంతులు విరోచనాలు బారిన పడ్డారని తెలిపారు ఇందులో ఎం.బి.బి.ఎస్ మొదటి చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఉన్నారని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ డైరెక్టర్ సూపరిండెంట్ డాక్టర్ బలరాం నాయక్ , జిల్లా వైద్య ఆరోగ్య శాఖా అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్, డిఐ ఓ  డాక్టర్ విజయసారతి, తదితరులు ఉన్నారు.

నలుగురితో కమిటి

రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వైద్య విద్యార్థులు మధ్యాహ్నం ఒంటి గంటకు  క్యాంటీన్‌లో అన్నం, పప్పు, టమాట కూరతో భోజనం చేశార. భోజనం వికటించింద. లేక నీళ్ళతో ఎలాజరిగింద . అనే అంశం పై నలుగురితో కూడిన  కమిటిని కలెక్టర్ సిక్తా పట్నాయక్ వేసినారు. కమిటిలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖా అధికారి. రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ డైరెక్టర్,ఆర్డబ్లుఎస్ ఎస్ సి, తో పాటు మరొకరిని నియమించారు.