కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక ఎడిటర్ ( 7013260176 9848025451)
హైదరాబాద్,(ఆరోగ్యజ్యోతి):
తెలంగాణ మెడికల్ అండ్ పబ్లిక్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ (ఎహ్1) యూనియన్ అధ్యక్షప్రధాన కార్యదర్శులు కర్నాటి సాయిరెడ్డి, మాండన్ సుదర్శన్ ఆధ్వర్యంలో రాష్ట్ర
వైద్య మరియు ఆరోగ్య శాఖ మాత్యులు శ్రీ ఈటెల రాజేందర్ గారిని కలిసి గత 18
సంవత్సరాలుగా వైద్య మరియు ఆరోగ్య శాఖ లో పనిచేయుచున్న కాంట్రాక్టు ఉద్యోగులను
క్రమబద్ధీకరణ చేయాలనీ కోరడం జరిగింది. ఈ
సందర్బంగా ఆయన మాట్లాడుతూ కరోనా సమయంలో
ప్రాణాలకు తెగించి పోరాడిన పారామెడికల్
ఉద్యోగుల సర్వీసునుక్రమబద్దీకరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని
ఇట్టి విషయాన్నీ గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్ గారి దృష్టికి తీసుకెలతానని
జివో నెంబర్ .16 ను
కోర్ట్ లో వెకేట్ చేసేందుకు ఉన్నతాధికారులతో మాటాడనున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమం లో ఎహ్ 1 యూనియన్ కార్యదర్శి ఇందిరాలరామకృష్ణ,యాతాకుల మధు బాబు, శుభకరన్, కోడ్ల శ్రీనివాస్, నరేందర్ రెడ్డి, వాంకుడోత్ వెంకన్న, గోపాల్,వెంగల్రావ్, మల్లేపల్లి వెంకట్ తదితరులు పాల్గొన్నారు.