కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి పెద్దపీట

 

రోగ్యం రంగంలో రూ.64,180 కోట్లతో ప్రత్యేక నిధి

15 ఎమర్జెన్సీ వెల్‌నెస్‌ కేంద్రాలు

కరోనా వ్యాక్సిన్‌ కోసం రూ.35వేల కోట్లు

న్యూఢిల్లీ, (ఆరోగ్యజ్యోతి):ఆరోగ్య మౌలిక సదుపాయాలను మెరుగుపరిచే దిశగా బడ్జెట్‌లో ప్రాధాన్యం కల్పించామని.. బడ్జెట్‌ ప్రసంగం సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. లోక్‌సభలో సోమవారం బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఆర్థిక వ్యవస్థకు ఉత్తేజం ఇవ్వాల్సిన సమయంలో బడ్జెట్‌ను దేశ ప్రజల ముందుంచామని, కీలక రంగాల్లో భారీగా వెచ్చించడంతో పాటు మౌలిక రంగానికి పెద్ద ఎత్తున కేటాయింపులు జరపాలని భావించామని చెప్పారు. ప్రభుత్వ వ్యయం పెంచడం ద్వారా వ్యవస్థలో అవసరమైన డిమాండ్‌ను పెంచేందుకు ప్రాధాన్యత ఇచ్చామని స్పష్టం చేశారు. గతేడాది కాలంగా మహమ్మారిపై పోరు సాగిస్తోన్న భారత్‌.. తాజా బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి అధిక ప్రాధాన్యం కల్పించింది. నివారణ, చికిత్స, సంపూర్ణ ఆరోగ్య సంరక్షణే లక్ష్యంగా ప్రజారోగ్యం కోసం రూ. 2.23లక్షల కోట్లు కేటాయించింది. గత బడ్జెట్‌లోని కేటాయింపులతో పోలిస్తే ఇది 137శాతం ఎక్కువ కావడం విశేషం.  

ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి

కరోనా మహమ్మారి దృష్ట్యా ఈ సారి బడ్జెట్‌లో వైద్యం, ఆరోగ్యంపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించింది. గతంతో పోలిస్తే ఈ రంగానికి రెట్టింపు బడ్జెట్‌ కేటాయించింది. ఇటీవల తీసుకొచ్చిన ప్రధానమంత్రి ఆత్మనిర్భర్‌ స్వస్థ్‌ భారత్‌ యోజనపథకం ద్వారా రానున్న ఆరేళ్లలో రూ. 64,180కోట్లు ఖర్చు చేయనున్నట్లు విత్తమంత్రి నిర్మలా సీతారామన్‌  బడ్జెట్‌ ప్రసంగంలో తెలిపారు. ప్రాథమిక, మధ్యస్థ, ప్రాంతీయ ఆరోగ్య వ్యవస్థల బలోపేతం కోసం ఈ మొత్తాన్ని కేటాయించింది. ఈ పథకం ద్వారా.. దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో సమీకృత వ్యాధి నిర్ధారణ ల్యాబ్‌లు, 11 రాష్ట్రాల్లో 3382 బ్లాక్‌ పబ్లిక్‌ హెల్త్‌ యూనిట్లను ఏర్పాటు చేయనుంది. 602 జిల్లాల్లో క్రిటికల్‌ కేర్‌ హాస్పిటల్‌ బ్లాకులు, 15 అత్యవసర ఆరోగ్య కేంద్రాలు, 2 మొబైల్‌ హాస్పిటల్స్‌, 9 బీఎస్‌ఎల్‌-3 స్థాయి ప్రయోగశాలలు, కొత్తగా 4 ప్రాంతీయ వైరాలజీ ల్యాబ్‌లను ఏర్పాటు చేయనుంది. 

కరోనావ్యాక్సినేషన్‌కు రూ. 35వేల కోట్లు

కరోనాపై పోరులో భాగంగా ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్‌ ప్రక్రియ భారత్‌లో ఇటీవల ప్రారంభమైంది. తొలి విడతలో భాగంగా 3కోట్ల మంది ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు ఉచితంగా టీకాలు అందిస్తోన్న ప్రభుత్వం.. వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కోసం బడ్జెట్‌లో ప్రత్యేకంగా కేటాయింపులు చేసింది. ఇందుకోసం 2021-22 బడ్జెట్‌లో రూ. 35వేల కోట్లు కేటాయించింది. అవసరమైతే మరింత కేటాయిస్తామని ఆర్థిక మంత్రి తెలిపారు. శాస్త్రవేత్తల కృషితో దేశంలో ప్రస్తుతం రెండు స్వదేశీ వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. వీటితో భారతీయులనే గాక, ప్రపంచవ్యాప్తంగా 100కి పైగా దేశాల్లోని ప్రజలకు రక్షణ కల్పిస్తున్నామని ఆర్థికమంత్రి తెలిపారు. త్వరలోనే మరో రెండు టీకాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. 2021లోనూ కరోనాపై పోరు సాగించాల్సిన అవసరం ఉందని అన్నారు. 

న్యూట్రిషన్‌ ప్రొగ్రామ్‌కు..

దేశంలో ఇప్పటికీ ఎంతోమంది సరైన తిండి లేక పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. అఆంటి వారి కోసం ప్రత్యేక మిషన్‌ను ప్రకటించారు. పోషణ్‌ అభియాన్‌, సప్లమెంటరీ న్యూట్రిషన్‌ ప్రొగ్రామ్‌ను కలిపి మిషన్‌ పోషణ్‌ 2.0ను త్వరలోనే ప్రారంభించనున్నారు. ఇందుకోసం రూ. 2,700 కోట్లు కేటాయించారు. 

  • స్వచ్ఛ భారత్‌, స్వస్థ్‌ భారత్‌నినాదంతో ముందుకెళ్తోన్న కేంద్రం పారిశుద్ధ్యం, రక్షిత మంచినీరు, వాయు కాలుష్య నివారణకు కూడా బడ్జెట్‌లో కేటాయింపులు చేసింది. ఆరోగ్య రంగంలో పరిశోధనలకు రూ. 2,600కోట్లు, ఆయుష్‌ విభాగానికి రూ. 2,900కోట్లకు పైగా కేటాయించింది. 
  • ఆరోగ్యం రంగంలో రూ.64,180 కోట్లతో ప్రత్యేక నిధి. దీనికి పీఎం ఆత్మనిర్భర్‌ భారత్‌ ఆరోగ్య పథకం.కొత్తగా 9 బీఎస్‌ఎల్‌-3 స్థాయి ప్రయోగశాలలు. 15 అత్యవసర కేంద్రాలు.
  •    జాతీయ స్థాయిలో వ్యాధి నివారణ కేంద్రం. 15 ఎమర్జెన్సీ వెల్‌నెస్‌ కేంద్రాల ఏర్పాటు. పట్టణాల్లో నీటి సమస్య పరిష్కారానికి జల్‌ జీవన్‌ అభియాన్‌.
  • కరోనా వ్యాక్సిన్‌ కోసం రూ.35వేల కోట్లు. భారత్‌తో పాటు మరో 100 దేశాలకు వ్యాక్సిన్‌ అందిస్తాం. దేశంలో మరో నాలుగు ప్రాంతీయ వైరల్‌ ల్యాబ్‌ల ఏర్పాటు.ఆత్మ నిర్భర్‌ భారత్‌ ప్రోత్సాహకాల్లో భాగంగా రూ.1.97
  • కోట్లతో ప్రత్యేక నిధి. ఆత్మనిర్భర్‌ ఆరోగ్య పథకానికిరూ.2,23,846కోట్లు. అన్ని జిల్లాల్లో సమీకృత వ్యాధినిర్థారణ కేంద్రాలు.
  •    15 అత్యవసర ఆరోగ్య కేంద్రాలు, 2 మొబైల్‌ హాస్పిటల్స్‌, 9 బీఎస్‌ఎల్‌-3 స్థాయి ప్రయోగశాలలు, కొత్తగా 4 ప్రాంతీయ వైరాలజీ ల్యాబ్‌లు
  •   కోవిడ్‌-19 వ్యాక్సినేషన్‌ కోసం 35వేల,400 కోట్లు
  • ఆరోగ్య రంగానికి పెద్దపీట 
  •  602 జిల్లాల్లో క్రిటికల్‌ కేర్‌ హాస్పిటల్‌ బ్లాకులు
  •  పోషణ్‌ అభియాన్‌, సప్లమెంటరీ న్యూట్రిషన్‌ ప్రొగ్రామ్‌కు రూ. 2,700 కోట్లు
  • ఆరోగ్య రంగంలో పరిశోధనలకు రూ. 2,600కోట్లు
  •  ఆరోగ్య పథకానికిరూ.2,23,846కోట్లు
  • 100 దేశాలకు మనం కరోనా టీకాలను సరఫరా చేస్తున్నాం
  •    కరోనా కేసులను కట్టడి చేయడంతో దేశ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టగలిగాం
  •   ఆరోగ్య రంగానికి పెద్దపీట
  • 100 దేశాలకు మనం కరోనా టీకాలను సరఫరా చేస్తున్నా
  •  కరోనా కేసులను కట్టడి చేయడంతో దేశ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టగలిగాం
  •  కరోనా నివారణకు దేశంలో రెండు వ్యాక్సిన్లు అందుబాటులోకి తెచ్చామన్నారు