కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక ఎడిటర్ ( 7013260176 9848025451)
- వికటించిన ఇంజెక్షన్
- వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ తల్లిదండ్రుల ఆరోపణ
- బంధువులతో కలిసి ఆస్పత్రి ఎదుట ఆందోళన
ఖమ్మం, (ఆరోగ్యజ్యోతి): హాస్పిటల్లో రోగి వెళ్ళినప్పుడు వైద్యుడు లేడు
వచ్చిన రోగిని ఆసుపత్రి నుంచి వైద్యులు లేదని పంపించడం కుదరదు తోచని పరిస్థితిలో
అక్కడ పనిచేస్తున్న నర్సు వైద్యులకు ఫోన్ చేశారు ఒక పాప అనారోగ్యంతో వచ్చిందని
లక్షణాలు ఇలా ఉన్నాయి మరి ఏం చేయాలి సార్ అంది వైద్యులు ఇచ్చిన సలహా మేరకు మనసు
ఇచ్చింది ఇంజక్షన్ ఇచ్చిన కొన్ని నిమిషాలకే పాప ప్రాణాలు పోగొట్టుకుంది..వివరాల్లోకి
వెళితే ... అభం శుభం తెలియని చిన్నారికి అంతంతమాత్రం పరిజ్ఞానంతో ఓ నర్సు ఇచ్చిన
ఇంజక్షన్ ఆ చిన్నారికి శాపంగా మారింది.. అ ఇంజక్షన్ వికటించదమ్తూ పసిపాప ప్రాణాలే పాయినవి. రోజంతా తల్లిదండ్రులతో
ఆడుతూ పాడుతూ అల్లారు ముద్దుగా కనిపించిన చిన్నారి ఇక లేదన్న విషయం ఆ
తల్లిదండ్రులకు గుండె కోతను మిగిల్చింది. తమ బిడ్డ ప్రాణాలను తీశారంటూ ఆసుపత్రి
ఎదుట తల్లిదండ్రులు గుండెలవిసేలా విలపించారు.
ఖమ్మం పట్టణం లోని ఓ ప్రైవేటు కార్పొరేట్ చిన్నారి మృతిచెందిన ఘటన బుధవారం
చోటుచేసుకుంది. చిన్నారి బంధువుల కథనం ప్రకారం.. ఖమ్మం నెహ్రూనగర్‌కు చెందిన హబీబ్
దంపతుల మిషన్ భగీరథ లో
కూలీ గా జీవనం కొనసాగిస్తున్నాడు . పెద్ద కుమార్తె నుస్రా తౌసీమ్ (3) బుధవారం తెల్లవారుజామునఏడుస్తోంది. భయఆందోళన
చెందిన తల్లిదండ్రులు ఉదయం 3 గంటల సమయంలో
హుటాహుటిన ఖమ్మంలోని ఒక ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఆ సమయంలో
ఎమర్జెన్సీ వైద్యులు లేరు. అక్కడి నర్సు ఫోన్‌లో వైద్యుడిని సంప్రదించి విషయం
చెప్పింది. అతడి సూచనల మేరకు ఓ ఇంజెక్షన్ వేసింది. తరువాత పది నిమిషాలకే ఆ
చిన్నారి మాటను, చూపును
కోల్పోయింది. తల్లిదండ్రులకు అనుమానం రావడంతో సిబ్బందికి చూపించారు. వారు
పరిశీలించి శ్వాస సమస్య ఉందని, మరో
ఆసుపత్రికి తీసుకెళ్లాలని చెప్పారు. అదే ఆసుపత్రి అంబులెన్సులో మరో ఆసుపత్రికి
తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించి.. చిన్నారి అప్పటికే మృతిచెందిందని
నిర్ధారించారు. దీంతో గుండెలవిసేలా రోదించిన తల్లిదండ్రులు, బంధువులు.. తిరిగి ప్రైవేటు ఆసుపత్రికి వచ్చి
మృతదేహాన్ని ఆసుపత్రి ఎదుట ఉంచి కలిసి ఆందోళన చేపట్టారు.