ఊళ్లలో ప్రభుత్వ క్లినిక్ లు

         కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక  ఎడిటర్ ( 7013260176  9848025451

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

ఫొటోస్-20,21,22,

ఆరోగ్య ఉప కేంద్రాలు

రాష్ట్రంలో 4,905 ఉప కేంద్రాలు క్లినిక్‌లుగా మార్పు

హైదరాబాద్‌(ఆరోగ్యజ్యోతి): ప్రభుత్వ వైద్యం ప్రైవేటు రూపంలో ప్రజలకు మరింత దగ్గర కానుంది గతంలో నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనే పాట గుర్తుకు వచ్చేలా ప్రభుత్వ వైద్యశాల అంటే చాలామంది వెళ్లేవారు కాదు. ఇటీవల తెలంగాణలో సకల సౌకర్యాలు ప్రభుత్వం కల్పించింది. ఉదాహరణగా తీసుకున్నట్లయితే గర్భిణీ మహిళలకు అనేక పథకాలు చేకూర్చి ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేసుకోవాలని లక్ష్యంతో ప్రభుత్వం పని చేసింది. ప్రస్తుతం చాలా మంది గర్భిణీలు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం అవుతున్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం కూడా పల్లెలకు, మండలాలకు, గ్రామీణ ప్రాంతాలకు, గిరిజన గ్రామాలకు వైద్య సేవలు అందించాలని ఉద్దేశంతో ఇటీవల జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్‌హెచ్‌ఎం)  సమీక్ష సమావేశంలో పలు రకాల అంశాలను చర్చించింది .ఈ సమావేశంలో తెలంగాణకు చెందిన పలువురు సీనియర్ వైద్యులు వైద్య శాఖ అధికారులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం ప్రకారం ప్రస్తుతం ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉప ఆరోగ్య కేంద్రాలు ఎక్కువగా మార్చి ప్రజలకు వైద్యం అందించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందులో ఎంబిబిఎస్ లేదా ఆయుర్వేద, హోమియోపతి, యునాని, ఆయుష్ లో ప్రత్యేక శిక్షణ పొందిన నర్సులను నియమించాలని నిర్ణయించారు. అయితే ఇందుకు అందరూ అంగీకరించినట్లు తెలిసింది రెండు మూడు గ్రామాలకు ఒక క్లినిక్ పల్లెల్లో నిర్వహించే క్లినిక్ లో సకల సౌకర్యాలు అందుబాటులోకి తేనున్నారు. మందులు అవసరమయ్యే ఇంజక్షన్స్ రకరకాల మందులు అనుభవం వైద్యుల చేత నిర్ణయం తీసుకున్నారు ఈ నిర్ణయం అమలైతే తెలంగాణలో ప్రతి గ్రామానికి ఒక క్లినిక్ ఏర్పడి అక్కడే ప్రజలకు వైద్యం అందుతుంది. రాష్ట్రంలో 4,905 ఉప కేంద్రాలు క్లినిక్‌లుగా మరనున్నయీ......

రెండుమూడు ఊళ్లకొక  క్లినిక్ 

ప్రస్తుతం పల్లెల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు(పీహెచ్‌సీ) వైద్యానికి కీలకంగా ఉన్నాయి. మెడికల్‌ ఆఫీసర్, నర్సులు ఉండటంతో ప్రాథమిక వైద్యం అక్కడే అందుతుంది.అవి దాదాపు ఒక్కో మండలంలో ఒక్కోటి రెండు  చొప్పున ఉన్నాయి. అయితే ఒక మండలంలో 15–20 గ్రామాలుంటే వారంతా పీహెచ్‌సీకి వెళ్లాల్సి వస్తుంది. అలా 20–30 కిలోమీటర్లు  వెళ్తేగానీ కొన్ని గ్రామాలకు వైద్యం అందే పరిస్థితి లేదు. అయితే రాష్ట్రంలో పీహెచ్‌సీల కింద 4,905 ఆరోగ్య ఉపకేంద్రాలున్నాయి. వీటిలో ఏఎన్‌ఎంలే ప్రస్తుతం బాస్‌లుగా ఉన్నారు. ఆయా ఉపకేంద్రాల్లో టీకాలు ఇవ్వడం, గర్భిణులు, పిల్లలకు మందులివ్వడం, సాదారణ వ్యడుల్ లకు వైద్యం అందించడం  వంటివి మాత్రమే నిర్వహిస్తున్నారు. ఈ ఆరోగ్య ఉప కేంద్రాలను క్లినిక్‌లుగా లేదా వెల్‌నెస్‌ సెంటర్లుగా మార్పు చేసి వాటిల్లో వైద్య సేవలు ప్రారంభిస్తే ప్రజలకు వైద్యం, మరింత చేరువన అవ్తుంది. . తద్వారా ప్రతీ రెండు మూడు గ్రామాలకు ఒక క్లినిక్‌ లేదా ఒక పెద్ద గ్రామంలో ఒక క్లినిక్‌ ఉండేలా ప్రణాళిక రూపొందిస్తారు. ఆయా క్లినిక్‌లలో రక్త పరీక్ష చేయడం, బీపీ, షుగర్‌ పరీక్షలు నిర్వహించడం, వాటికి తగు వైద్యం అందించడంపై ఫోకస్‌ పెడతారు. దీంతో ప్రైవేట్‌ ప్రాక్టీషనర్లపై ఆధారపడకుండా నాణ్యమైన వైద్యం రోగులకు అందుతుందని ప్రభుత్వం భావిస్తోంది. 

ఎంబీబీఎస్‌ పూర్తి ఐనవారికి  అవకాశం

ప్రతీ ఏటా వేలాది మంది వైద్యులు మెడికల్‌ కాలేజీల నుంచి ఎంబీబీఎస్‌ పూర్తి చేసుకొని బయటకు వస్తున్నారు. వారిలో కొందరు మెడికల్‌ పీజీలకు వెళ్తుండగా, కొందరు అత్యంత తక్కువ వేతనాలకు ప్రైవేట్‌  ఆసుపత్రుల్లో పనిచేస్తున్నారు. వైద్య సేవలు తీసుకురావాలన్నా ఆరోగ్య ఉప కేంద్రాలను క్లినిక్‌లుగా మార్చడం సరైందని కేంద్రం నిర్ణయించినట్లు తెలుస్తుంది. ఒకవేళ ఎక్కడైనా ఎంబీబీఎస్‌ వైద్యులు, ఆయుష్‌ డాక్టర్లు ముందుకు రాకపోతే అటువంటి చోట్ల ప్రత్యేక శిక్షణ పొందిన నర్సులను ఆయా క్లినిక్‌లలో నియమిస్తారు.నర్సులకు మిడ్‌ లెవెల్‌ హెల్త్‌ ప్రొవైడర్స్‌ (ఎంఎల్‌హెచ్‌పీ) అనే హోదా ఇస్తారు. ఎంఎల్‌హెచ్‌పీలుగా నియమితులవ్వడానికి బీఎస్సీ నర్సింగ్‌ అర్హతగా నిర్ణయించారు. ఈ క్లినిక్‌లు పీహెచ్‌సీ పరిధిలో ఉంటాయి. ఇక్కడ నయం కాని జబ్బులను పీహెచ్‌సీకి పంపిస్తారు. డాక్టర్లను లేదా ప్రత్యేక శిక్షణ పొందిన నర్సులను కాంట్రాక్టు ప్రాతిపదికన నియమించే అవకాశం ఉంది. పారితోషికాన్ని ఎన్‌హెచ్‌ఎం ద్వారా ఇస్తారు. మూడేళ్ల పాటు ఆయా క్లినిక్‌లలో పనిచేయాలన్న హామీపత్రం ఇవ్వాలన్న నియమం పెట్టే అవకాశం ఉంది. పైగా వీరు కొత్త క్లినిక్‌లున్న చోటే నివాసం ఉండాలన్న షరతూ విధిస్తారు.