జిల్లావ్యాప్తంగా430మందికి కోవిడ్ టీకా

     కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక  ఎడిటర్ ( 7013260176  9848025451)

వరంగల్ అర్బన్,(ఆరోగ్యజ్యోతి): జిల్లావ్యాప్తంగా 430 మంది రెవెన్యూ పంచాయతీ సిబ్బందికి కొవిడ్ పీక ఇవ్వడం జరిగిందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె లలితాదేవి తెలిపారు. గురువారం సాయంత్రం వరకు 431 మందికి టీకాలు ఇచ్చామని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. జనవరిలో మొదటి టీక తీసుకున్న వారందరికీ రెండవ విడత ఇవ్వడానికి కూడా తేదీలు ఖరారు చేయడం జరిగిందని తెలిపారు. ఫిబ్రవరి 13 శనివారం రోజున ఇవ్వడం జరుగుతుందన్నారు. జనవరి 18న వ్యాక్సిన్ తీసుకున్నవారికి ఫిబ్రవరి 15వ తేదీన జనవరి 19 తేదీన, వ్యాక్సిన్ తీసుకున్నవారికి ఫిబ్రవరి 16న జనవరి 21న వ్యాక్సిన్ తీసుకున్నవారికి ఫిబ్రవరి 18న జనవరి 22న వ్యాక్సిన్ తీసుకున్నవారికి ఫిబ్రవరి 19న వారు తీసుకున్న సెంటర్లోని వ్యాక్సిన్ రెండవ విడత ఇవ్వడం జరుగుతుందన్నారు .మొదటి విడతలో టీకాలు తీసుకున్న వారు  రెండో విడత ప్రతి ఒక్కరూ తీసుకోవాలని సూచించారు.