కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక ఎడిటర్ ( 7013260176 9848025451)
ఆదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి): కోవిడ్ వ్యాక్సిన్ పొందని వారికి నేడు చివరి
అవకాశమని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ ఒక ప్రకటనలో
తెలిపారు. కొవిడ్ వ్యాక్సిన్ పొందని ఫ్రంట్ లైన్ వర్కర్స్ పోలీస్.
మునిసిపాలిటి.రెవెన్యూ. పంచాయితీరాజ్ సిబ్బంది కి మొపప్ రౌండ్ కొవిడ్ వ్యాక్సిన్
ఇవ్వబడును . కోవిడ్ వ్యాక్సిన్ తీసుకొని వారు ఎలాంటి అపోహలకు గురి కాకుండా
వ్యాక్సిన్ తీసుకోవాలని ఆయన కోరారు ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా చాలామంది
వ్యాక్సిన్ తీసుకున్నారని ఎలాంటి ఇబ్బందులు కాలేదని సూచించారు సంబంధిత శాఖ
అధికారులు సిబ్బందికి వ్యాక్సిన్ ప్రయోజనాలను తెలియపరచి వ్యాక్సిన్
ఇప్పించవలసిందిగా ఆయన కోరారు.ఈ అవకాశాన్ని వ్యాక్సిన్ తీసుకొని ప్రతి ఒక్కరూ
వినియోగించుకోవాలని ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కోరారు.