వరంగల్
(ఆరోగ్యజ్యోతి):పట్టణంలో ఈవినింగ్ క్లినిక్ను
నిర్వహించారు. పిల్లల వైద్యులు డాక్టర్ సందీప్ రెడ్డి ఆధ్వర్యంలో
రోగులకు అన్ని రకాల వైద్య పరీక్షలు చేశారు. చింతల్
పట్టణ ఆరోగ్య కేంద్రంలో సోమ వారం సాయంత్రం క్లినిక్ ను నిర్వహించారు. అవసరమైనవారికి
రక్త పరీక్షలు నిర్వహించారు రోగులకు ఉచితంగా మందులు ఇవ్వడం జరిగింది. సాయంత్రం నిర్వహించే ప్రతి ఒక్కరు
వినియోగించుకోవాలని సూచించారు అవసరమైన పరీక్షలు నిర్వహించి అనంతరం ఉచితంగా మందులు
పంపిణీ చేయడం జరుగుతుందని ఆమె తెలిపారు ఈ
కార్యక్రమంలో ఎన్ హెచ్ ఎం కో చైర్మన్ రాజేష్ కన్నా, చింతల్ పట్టణ ఆరోగ్య కేంద్రంలో తదితరులు
పాల్గొన్నారు.