కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక ఎడిటర్ ( 7013260176 9848025451
వరంగల్,(ఆరోగ్యజ్యోతి): పట్టణంలోని న్యూ పెద్దమ్మగడ్డ పట్టణ ప్రాథమిక ఆరోగ్య
కేంద్రంలో బుధవారం నాడు పట్టణంలోని మున్సిపల్ సిబ్బందికి స్టాఫ్ నర్స్ అరుణ కరోన
టీకా ఇచ్చారు .ఈ సందర్భంగా పెద్దమ్మగడ్డ పట్టణ ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి
డాక్టర్ ప్రియంకా మాట్లాడుతూ కరోన టీకా
ప్రతి ఒక్కరు తీసుకోవాలని సూచించారు .ఒకసారి తీసుకున్న తర్వాత రెండోది కూడా 28
రోజుల తర్వాత తీసుకోవాల్సి ఉంటుందని ఆమె గుర్తు చేశారు. ప్రజల్లో అపోహలు చాలా
ఉన్నాయని వాటిని పక్కన పెట్టాలని సూచించారు. వ్యాక్సిన్ తీసుకున్న వారికి ఎలాంటి చెడు
జరగదని ఈ సందర్భంగా ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో ల్యాబ్ టెక్నీషియన్ శోభ, . ఏ
ఎన్ ఎం సరోజ, ఆశ కార్యకర్తలు పట్టణ ఆరోగ్య కేంద్రం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు