కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక ఎడిటర్ ( 7013260176 9848025451
·
నిఘా కరువు.... అంతా దగా..
·
తూతూమంత్రంగా పర్యవేక్షణ... యథేచ్ఛగా దందా
·
తీవ్రంగా నష్టపోతున్నరోగులు
మెడికల్ షాపుల్లో యథేచ్ఛగా నకిలీ మందుల దందా కొనసాగుతోందనే
ఆరోపణలు వ్యక్తమ వుతున్నాయి. హోల్‌సేల్ డ్రగ్ వ్యాపారులు.. మెడికల్ దుకాణాల నిర్వాహకులు
ధనార్జనే ధేయ్యంగా నిబంధనలకు తిలోదకాలిచ్చి తమ వ్యాపారాలను సాగిస్తున్నారు. హోల్‌సేల్
వ్యాపారులు మరింత బరితెగించి రిటైల్ దుకాణాలకు నకిలీ మందులను సరఫరా
చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వ్యాపారులు మెడికల్ దుకాణాలకు
ఇచ్చే ప్రతీ డ్రగ్‌పై బ్యాచ్ నంబరు ఉంటుంది. ఇలా రిటైల్ దుకాణాలకు ఇచ్చే సమయంలో
బిల్లుపై పొందుపరిచిన బ్యాచ్ నంబర్, కొనుగోలుదారుడికి ఇచ్చే బిల్లుపై రాసే బ్యాచ్ నంబరు కూడా
ఒకే విధంగా ఉంటేనే సరైనవని నమ్మొచ్చు. కానీ రెండు బిల్లులపై వేర్వేరు నంబర్లు
ఉండడం నకిలీ మందుల దందా కొనసాగుతుందనే ఆరోపణలకు బలం చేకూరుస్తోంది.
వైద్యుడి ప్రిస్ర్కిప్షన్ లేకుండా మందులు
విక్రయించొద్దనే నిబంధన ఉంది. అయితే నిరక్షరాస్యులు, గిరిజనులు, వృద్ధులు అవసరాలను ఆసరాగా చేసుకుని మెడికల్ షాపుల
నిర్వాహకులు మందులు విక్రయిస్తూ అధిక మొత్తంలో డబ్బు గుంజుతున్నారు. అడ్డగోలుగా
మందులు విక్రయిస్తూ కొందరు నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. పర్యవేక్షించాల్సిన
అధికారులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తుండటం విమర్శలకు తావిస్తోంది. ప్రిస్క్రిప్షన్ లేకుండానే మందులు ఇవ్వడం
ఆనవాయితీగా వస్తుంది. నాకు తలనొప్పి జలుబు ఒళ్ళు నొప్పులు ఉన్నాయి టాబ్లెట్
ఇవ్వండి సార్ అంటే మన మెడికల్ షాప్ లోకి వెళ్ళినట్లయితే అక్కడ ఉన్న బైక్ లో పిక్స్
యాంటీబయాటిక్ బ్లాక్ మందులు ఇస్తున్నారు కరువు కావడం వల్లనే రోజురోజుకు ఇలాంటి
జరుగుతున్నాయి. డాక్టర్ ప్రిస్కిప్షన్ లేకుండా మందులు ఇవ్వద్దని చట్టాలు జీవోలు ఎన్ని
ఉన్నప్పటికీ కూడా అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇలా జరుగుతుంది ఉన్నాయి . డాక్టర్
వద్దకు వెళ్లకుండానే అనారోగ్యానికి గురైన వ్యక్తి నేరుగా మందుల షాప్ లోకి వచ్చి ఈ
లక్షణాలు చెప్పిన వెంటనే మెడికల్ షాప్ యజమానులు ఇలా చెప్పిన వెంటనే అలా అందిన
కాడికి దోచుకుంటున్నారు
నియంత్రణ కరువు..
వైద్యం పేరుతో వ్యాపారం చేసే కొన్ని హోల్‌సేల్ ఏజెన్సీలతో
పాటు, మెడికల్ దుకాణాలపై ఔషధ నియంత్రణ విభాగం
అధికారుల నిఘా పూర్తిగా కొరవడింది. మెడికల్ షాపులు పట్టన్నల్లో గ్రామాల్లో వందలకు
పైగా ఉంటాయని అంచనా. అయితే నిబంధనలు పాటించకుండా మందులు విక్రయిస్తున్నారనే
విషయంపై తనిఖీలు లేకపోవడం అక్రమాలకు ఊతమిస్తోంది. ప్రస్తుతం మెడికల్ షాపుల
యజమానులు మాత్రం బ్రాండెడ్ మందుల ముసుగులో జనరిక్ మందులు అమ్ముతూ దోపిడీకి
పాల్పడుతున్నారు.బ్రాండెడ్ మందులు విక్రయిస్తే రిటైలర్లకు సుమారు 18 నుంచి 20 శాతం లాభాలు వస్తుండగా, వాటి పేరుతో జనరిక్ మందులు అమ్మితే 70 నుంచి 200శాతం లాభాలు గడిస్తున్నారు. జనరిక్, బ్రాండెడ్ మందుల
నాణ్యతలో ఎలాంటి వ్యత్యాసం లేదని ఔషధ నియంత్రణ శాఖ అధికారులు చెబుతున్నప్పటికీ
వైద్యులు సిఫార్సు చేయడం లేదు. ఒకే రకమైన మందులను తయారు చేస్తున్న కొన్ని కంపెనీలు
ఆయా మందులపై ధర వ్యత్యాసంతో ముద్రించడం, మరికొన్ని కంపెనీలు రెండు ధరలనూ ముద్రిస్తుండడంతో గందరగోళం
నెలకొంటుంది.ఉదాహరణకు ఓ కంపెనీ తయారు చేసిన సిఫిగ్జిమ్-200 ఎంజీ పది మాత్రలకు బ్రాండెడ్‌లో రూ.120లకు లభిస్తుండగా, జనరిక్‌లో రూ.40లకే లభ్యమవుతున్నాయి. అయితే జిల్లాలో
పరిగి, వికారాబాద్, తాండూరు, కొడంగల్ ప్రాంతాల్లోని రోగులు ఏది ఏరకం మందో తెలియక
తీవ్రంగా నష్టపోతున్నారు. పేదలను దృష్టిలో ఉంచుకొని గ్రామీణ ప్రాంతాల్లో జనరిక్
మందుల దుకాణం ఏర్పాటు చేస్తే రోగులకు ప్రయోజనం చేకూర్చే అవకాశం ఉంది.
ఫార్మాసిస్టుల జాడేది.?
మెడికల్‌షాపుల్లో ఫార్మాసిస్టులు కనిపించడం లేదు. అనుభవం
కోసం దుకాణాల్లో పనిచేస్తున్న వారే నిర్వాహకులుగా మారిపోతున్నారు. ఫార్మసీ చేసిన
వారి రఽధువీకరణపత్రాలను లీజు ఒప్పందంతో తీసుకుని ఏడాదికి కొంత మొత్తం చెల్లిస్తూ
ఇతరులు దుకాణాలను నిర్వహిస్తుండడం గమనార్హం.
జనరిక్‌కు ప్రోత్సాహం ఏది..?
పేదలకు అందుబాటులోకి రావాల్సిన జనరిక్‌ను అధికారులు ఎందుకు
ప్రోత్సహించడం లేదని విమర్శిస్తున్నారు. వికారాబాద్ జిల్లాలో మెడికల్‌షాపు
యజమానులంతా కలిసి డ్రగ్ ఇన్‌స్పె క్టర్‌ను తమ చేతుల్లో పెట్టుకున్నారు. మెడికల్
షాపుల యజమానుల సంఘం నేతలు చెప్పిన విధంగా అధికారులు నడుచుకోవాల్సిన పరిస్థితి
నెలకొంది. ఇటీవల పరిగిలో ఓ వ్యక్తి జనరిక్ మందుల షాపు ప్రారంభించేందుకు అన్ని
ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే సంఘం నేతలు జనరిక్ షాపు పెడితే ఇబ్బందులు పడతావని
సదురు వ్యక్తికి హెచ్చరించారు. స్థానికేతరుడైన ఆ వ్యక్తి భయపడి వెనుదిరిగాడు.