ప్రభుత్వఆసుపత్రిలో 182మందికి కరోనా టీకాలు

      కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక  ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176  9848025451)

తూర్పుగోదావరి,(ఆరోగ్యజ్యోతి) జిల్లాలోని  ఆలమూరు, చొప్పెల్ల, పెదపళ్ల, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 182మందికి కరోనా టీకాలు ఇచ్చారు. ఈ సందర్భంగా  ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్య అధికారులు వైద్యులు డాక్టర్ కె. కన్యాకుమారి, డాక్టర్ పి.భవాని శంకర్, డాక్టర్ ఎమ్.సుమలత లు మాట్లాడుతూ కరోన  టికా తీసుకునేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలన్నారు. కరోన  టికా తీసుకున్నవారు భయపడవలసిన అవసరం లేదని తెలిపారు. కరోన  రాకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యలు ప్రతి ఒక్కరు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా కోవిడ్ కుండా ఉండేందుకు సామాజిక దూరం తోపాటు మాస్కులు ధరించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, పాల్గొన్నారు.