బోన్ మ్యారో వ్యాధితో బాధపడుతున్న చిన్నారికి 20వేల ఆర్థిక సహాయం

    కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక  ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176  9848025451)

కోడూరు,(ఆరోగ్యజ్యోతి):  మండల పరిధిలోని రామకృష్ణాపురం పంచాయతీ శివారు ఇరాలి గ్రామానికి చెందిన గంజల పవన్ సాయి బోన్ మ్యారో వ్యాధితో బాధ పడుతున్నరు.చిన్నారి ఆపరేషన్ నిమిత్తం 21 లక్షలు నగదు అవసరం కాగా ఇప్పటికే దాతలు ముందుకు వచ్చి తమ సహాయ సహకారాలు అందిస్తున్నారు.చిన్నారి కి సాయం చేసేందుకు నాగాయలంక పోలీసులు కూడా ముందుకు వచ్చి, ఎస్సై శ్రీనివాస్ ,సిబ్బంది తో పాటు సచివాలయాల్లో విధులు నిర్వహించే మహిళా సంరక్షణ కార్యదర్శి లు స్వచ్ఛందంగా నగదును అందించారు.20 వేల నగదును పోలీసులు సమకూర్చి శనివారం ఎస్సై శ్రీనివాస్ చేతుల మీదగా పవన్ సాయి కుటుంబ సభ్యులకు అందించారు.ఈ సందర్భంగా ఎస్సై శ్రీనివాస్ మాట్లాడుతూ పవన్ సాయి కి సహాయం చేసేందుకు దాతలు ముందుకు రావాలని ఆయన కోరారు .ప్రతి ఒక్కరు చేత వేసినట్లయితే సాయి ఆరోగ్యాన్ని కాపాడే అవుతామని తెలిపారు.