కృష్ణ,(ఆరోగ్యజ్యోతి): ప్రతిరోజు మనం అనేక రకాల వింతలు చూస్తూనే ఉన్నాం.. అలాగే ఈరోజు 3 కాళ్ళతో వింత శిశువు జననం కూడాఒక వింతనే .. ఆంధ్ర ప్రదేశ్ లోని కృష్ణా జిల్లా నూజివీడు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో మూడు కాళ్ళతో వింత శిశువు గురువారం నాడు జన్మించాడు. తల్లి బిడ్డ ఆరోగ్యంగా నిలకడగా ఉందని ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నరేంద్ర సింగ్ తెలిపారు. అయినప్పటికీ మెరుగైన వైద్య సేవల కొరకు విజయవాడ ఆస్పత్రికి తరలించినట్లు ఆయన తెలిపారు.