రిమ్స్ కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలి

        కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక  ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176  9848025451)

  • ·         లేనిపక్షంలో ఆందోళన కార్యక్రమాలు
  • ·         జాక్ కన్వీనర్ మల్లయ్య

ఆదిలాబాద్ రిమ్స్,(ఆరోగ్యజ్యోతి): రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కళాశాల మరియు ఆసుపత్రి లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలను చెల్లించలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని రిమ్స్  తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ (జాక్ ) జేఏసి కన్వినర్ మల్లయ్య అన్నారు .గురువారం నాడు రిమ్స్  ఓపి విభాగం వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించారు. గురువారం నాటికి ఈ ధర్నా నాలుగో రోజుకు చేరింది .ఒక గంట పాటు ధర్నా నిర్వహించిఅనంతరం సిబ్బది విధుల్లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రిమ్స్ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల తో పాటు ఆసుపత్రిలో పనిచేస్తున్న స్టాఫ్ నర్సులు, సెక్యూరిటీ గార్డులు, ఇతర సిబ్బందికి మూడు నుంచి ఆరు నెలల వరకు వేతనాలు కాంట్రాక్టర్లు చెల్లించవలసి ఉందన్నారు. కానీ ఇంతవరకు వేతనాలు  చెల్లించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చాలీచాలని వేతనాలతో పనులు చేస్తున్నప్పటికీ మా పై చిన్నచూపు చూస్తున్నారని ఆయన పేర్కొన్నారు మూడు నాలుగు నెలలకు ఒకసారి ఉద్యోగులందరికీ ఇదే పరిస్థితి ఎదురవుతుందని తెలిపారు. మేము ధర్నాలో చేసినప్పుడు మాత్రం దగ్గరికి అధికారులు కాంట్రాక్టర్లు వచ్చి వేతనాలు చెల్లిస్తామని ఒక నెల వేతనం చెల్లించడం తర్వాత చేతులు దులుపుకోవడం మల్లీ అదే తీరు  కొనసాగుతుందన్నారు. ఈ పద్ధతి కి శాశ్వత పరిష్కారం ప్రభుత్వం ఆలోచించాలని ఆయన డిమాండ్ చేశారు. వేతనాలు రాకపోవడంతో ఎందరో ఉద్యోగులు అరిగోస పడుతున్నారని ప్రభుత్వం కానీ కాంట్రాక్టర్ కానీ తమ గురించి ఒక్క నిమిషం ఆలోచిస్తే మా బాధలు అర్థం అవుతాయని తెలిపారు. కానీ ఆలోచించే సమయం కూడా వారికి లేదని అన్నారు. ఒక నెల వేతనం ఆలస్యంగా వస్తే ఎందరో ఉద్యోగులు ఇబ్బందులు పడతారని అలాంటి మా కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు మూడు నుంచి ఆరు నెలల వరకు రాకుంటే బ్రతుకు ఎలా బ్రతుకు కోన  సాగుతుందని ఆయన ప్రశ్నించారు. శుక్రవారం సాయంత్రం వరకు వేతనాలు చెల్లించి నట్లైతే ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ (జాక్ ) జేఏసి నాయకులు అక్రం ఖాన్,యండి అసిప్, బి శ్రీనివాస్, జవిడ్ తదితరులు పాల్గొన్నారు.