రోగులకు సేవలు అందించడంలో ముందుండాలి

   కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక  ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176  9848025451)

ఇబ్రహీంపట్నం,(ఆరోగ్యజ్యోతి): రోగులకు సేవలు అందించడంలో వైద్యులు ముందుండాలని జిల్లా పరిషత్ సభ్యులు నిత్య నిరంజన్ రెడ్డి అన్నారు. శనివారం నాడు మంచాల మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రోగులకు సేవలు అందించడంలో వైద్యులు వైద్య సిబ్బంది కీలక పాత్ర పోషించారు. మండలంలో చాలావరకు వ్యవసాయ పొలంలో పని చేసి రైతులు ఎక్కువగా ఉన్నారని పాముకాటుకు ఇతర వ్యాధులకు అయితే ఆసుపత్రికి వచ్చిన వెంటనే వైద్యసేవలు అందించాలన్నారు. మళ్లీ విజృంభిస్తుంది ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ప్రజలకు అన్ని రకాల వైద్య చికిత్సలు నిర్వహించడంతో పాటు శాస్త్ర చికిత్సలు కూడా చేయాలని సూచించారు మండలంలోని ప్రజలు ఏ సమయంలో వచ్చినను సిబ్బంది అందుబాటులో ఉండాలని ఆమె కోరారు .ఆసుపత్రికి ఏదైనా అవసరం ఉంటే తన సొంత నిధులతో సామాగ్రిని అందిస్తాం అని ఈ సందర్భంగా వైద్యులకు వైద్య సిబ్బందికి ఆమె సూచించారు .ఈ కార్యక్రమంలో డాక్టర్ అరుణ తార గారు,మరియు మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు నరేందర్ రెడ్డి ,నోముల ఎంపిటిసి జయ నందం,మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంకటేష్ గౌడ్, జంగయ్య,హన్మంతు,సురేష్ తదితరులు పాల్గొన్నారు.